- Telugu News Photo Gallery Cinema photos Heroine Mrunal Thakur restrictions for movies traditional look in Tollywood, glamour look in Bollywood Telugu Actress Photos
Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ అంతా తెలిసే చేస్తున్నారా.! చేసిన 3 సినిమాలకే ఇంతా.?
ఒక్కోసారి అతిజాగ్రత్త కూడా కెరీర్ పాడు చేస్తుందేమో.? అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు.. దానికి కళ్ల ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ మృణాళ్ ఠాకూర్. ఒక్క హిట్ రాగానే 10 సినిమాలు ఒప్పుకుంటున్న ఈ రోజుల్లో.. ఈ భామ ఇంత స్లోగా ఉండడానికి కారణమేంటి..? అతి జాగ్రత్తకు పోతుందా లేదంటే జాగ్రత్తగా ఈమెను దర్శకులే సైడ్ చేస్తున్నారా.? మృణాళ్ ఠాకూర్.. టాలీవుడ్‌గా మొన్నటి వరకు బాగా వినిపించిన పేరు ఇది.
Updated on: Aug 17, 2024 | 11:45 AM

ఒక్కోసారి అతిజాగ్రత్త కూడా కెరీర్ పాడు చేస్తుందేమో.? అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు.. దానికి కళ్ల ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ మృణాళ్ ఠాకూర్.

ఒక్క హిట్ రాగానే 10 సినిమాలు ఒప్పుకుంటున్న ఈ రోజుల్లో.. ఈ భామ ఇంత స్లోగా ఉండడానికి కారణమేంటి..? అతి జాగ్రత్తకు పోతుందా లేదంటే జాగ్రత్తగా ఈమెను దర్శకులే సైడ్ చేస్తున్నారా.?

మృణాళ్ ఠాకూర్.. టాలీవుడ్‌గా మొన్నటి వరకు బాగా వినిపించిన పేరు ఇది. చేసింది మూడు సినిమాలే కావచ్చు.. కానీ వాటిలో మృణాళ్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మాట్లాడింది.

దాంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు ఆ మధ్య బాగానే క్యూ కట్టారు. కానీ మృణాళ్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు. ఓ సినిమా అయ్యాకే.. మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు.

బాలీవుడ్‌లో బోల్డ్ షో.. టాలీవుడ్‌లో ట్రెడీషినల్.. మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఆమె కావాలనుకున్న ఇమేజ్ కాదు కానీ దర్శకులు మాత్రం మృణాళ్‌లోని నటిని మాత్రమే చూస్తూ.. గ్లామర్ కోణం వదిలేసారు.

సీతా రామం, హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది. మొన్న ఫ్యామిలీ స్టార్‌లోనూ పద్దతిగానే కనిపించారు మృణాళ్ ఠాకూర్. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో దానిపై ఎక్కడా డిస్కషన్స్ లేవు. మొన్నటి వరకు ఆఫర్స్ క్యూ కట్టినా.. మరో శ్రీలీల, కృతి శెట్టి అవుతానేమో అని తొందరపడలేదు మృణాళ్.

ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే లాంటి హీరోయిన్ల పుణ్యమా అని.. ఈమె వైపు ఎవ్వరూ పెద్దగా చూడట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ చేసారు మృణాళ్. అక్కడే సన్ ఆఫ్ సర్దార్ 2తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ లెక్కన టాలీవుడ్‌కు మృణాళ్ బైబై చెప్పినట్లేనేమో.?




