Janhvi Kapoor in Devara: దేవర పైనే జాన్వీ ఆశలన్నీ.. రీల్స్ తో దుమ్ములేపుతున్న చుట్టమల్లే సాంగ్.
సౌత్ ఎంట్రీ విషయంలో ఎగ్జైటెడ్‌గా ఉన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి దక్షిణాది వైపు చూస్తున్న ఈ బ్యూటీ, ఫైనల్‌గా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న జూనియర్ శ్రీదేవి, ప్రతీ చిన్న విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన జాన్వీ కపూర్, సౌత్‌లో ఆ రేంజ్ కోసం కష్టపడుతున్నారు.