- Telugu News Photo Gallery Cinema photos Festival scenes is a hit and a new success formula for Tollywood
Jathara: జాతర ఉంటె హిట్ పక్క.. ఇదే టాలీవుడ్ నయా సక్సెస్ ఫార్ములా..
సినిమాకు మాస్ అప్పీల్ కావాలన్నా, భారీతనం కనిపించాలన్నా, మంచి ఫైట్ సీక్వెన్స్ కి ఇంట్రో కావాలన్నా, అద్దిరిపోయే స్పెషల్ సాంగ్‌కి స్టేజ్ ఫిక్స్ చేయాలన్నా... ఓ జాతరను ప్లాన్ చేసుకోవాల్సిందే. మొన్న మొన్నటిదాకా సినిమా రేంజ్‌ని పెంచడానికి ఉపయోగపడ్డ జాతర ఎపిసోడ్‌లో ఇప్పుడు సినిమా కథలోనూ కీ రోల్ పోషిస్తున్నాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Aug 17, 2024 | 6:47 AM

సినిమాకు మాస్ అప్పీల్ కావాలన్నా, భారీతనం కనిపించాలన్నా, మంచి ఫైట్ సీక్వెన్స్ కి ఇంట్రో కావాలన్నా, అద్దిరిపోయే స్పెషల్ సాంగ్‌కి స్టేజ్ ఫిక్స్ చేయాలన్నా... ఓ జాతరను ప్లాన్ చేసుకోవాల్సిందే. మొన్న మొన్నటిదాకా సినిమా రేంజ్‌ని పెంచడానికి ఉపయోగపడ్డ జాతర ఎపిసోడ్‌లో ఇప్పుడు సినిమా కథలోనూ కీ రోల్ పోషిస్తున్నాయి.

రీసెంట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కమిటీ కుర్రోళ్లు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జాతర ఎపిసోడ్‌ని స్కిప్ చేయడం లేదు సినిమా చుసిన జనాలు. అంతగా కథలో కలిసిపోయింది ఆ ఎపిసోడ్.

నెక్స్ట్ రిలీజ్‌కి రెడీ అవుతున్న పుష్ప2లో జాతర ఎపిసోడ్‌ని అత్యంత భారీగా తెరకెక్కించారు మేకర్స్. గంగమ్మ జాతరను పుష్ప2లో చూసిన వారికి పూనకాలు ఖాయం అంటున్నారు మేకర్స్.

ఇటు దేవరలోనూ జాతర ఎపిసోడ్ హైలైట్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. తారక్, జాన్వీ జంటగా నటిస్తున్న దేవరకు ఆల్రెడీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ మనదే... బేఫికర్ అంటూ ఫ్యాన్స్ లో హైప్ పెంచేస్తున్నారు కొరటాల.

రీసెంట్ రిలీజులు, ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలే కాదు.. గతంలో క్లిక్ అయిన వాల్తేరు వీరయ్య, క్రాక్, మంగళవారం, రంగస్థలం సినిమాల్లోనూ జాతర ఎపిసోడ్స్ కీ రోల్ పోషించాయి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న మాస్ ఎపిసోడ్స్ లో నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకుంటోంది జాతర ఎపిసోడ్.