- Telugu News Photo Gallery Cinema photos Heroine Janhvi Kapoor ulajh Movie team reveals her action scene Telugu Actress Photos
Janhvi Kapoor: రియల్ లైఫ్‌లో జాన్వీ చాలా సెన్సిటివ్. కానీ.. రివీల్ చేసిన ఉలజ్ టీం.
స్టార్ ఇమేజ్ అందుకోవటంలో తడబడినా నటిగా ప్రూవ్ చేసుకోవటం విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. అప్ కమింగ్ మూవీలో యాక్షన్ సీన్స్‌లోనూ నటించిన ఈ బ్యూటీ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రశంసలు అందుకున్నారు. త్వరలో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్న జాన్వీ కపూర్, అంతకన్నా ముందు ఉలజ్ అనే బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Updated on: Jul 31, 2024 | 11:32 AM

స్టార్ ఇమేజ్ అందుకోవటంలో తడబడినా నటిగా ప్రూవ్ చేసుకోవటం విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. అప్ కమింగ్ మూవీలో యాక్షన్ సీన్స్‌లోనూ నటించిన ఈ బ్యూటీ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రశంసలు అందుకున్నారు.

త్వరలో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్న జాన్వీ కపూర్, అంతకన్నా ముందు ఉలజ్ అనే బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో యంగెస్ట్ గవర్నమెంట్ అఫీషియల్‌గా తన వయసుకు మించిన పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్‌లో జాన్వీ క్యారెక్టర్‌కు సంబంధించి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్.

ప్రస్తుతం ఉలజ్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు జాన్వీ. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో జాన్వీ పర్ఫామెన్స్ గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పొవెల్.

'రియల్ లైఫ్‌లో జాన్వీ చాలా సెన్సిటివ్, ఎవరినీ ఇబ్బంది పెట్టి, గాయపరిచే అమ్మాయి కాదు. కానీ వన్స్ షాట్ మొదలైతే మాత్రం పూర్తిగా మారిపోతుంది' అన్నారు నిక్.

నలుగురిని కొట్టి పడేసేందుకు కూడా కూడా జాన్వీ వెనకాడలేదు అంటూ ఉలజ్‌లో యాక్షన్ సీన్స్ గురించి రివీల్ చేశారు.

గ్లాడియేటర్, ది లాస్ట్ సమురాయ్ లాంటి భారీ హాలీవుడ్ మూవీస్‌కి వర్క్ చేసిన నిక్ పొవెల్, జాన్వీ ఫైట్స్ గురించి ప్రశంసలు కురిపించటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఇమేజ్ తెలుగు సినిమాలకు కూడా హెల్ప్ అవుతుందంటున్నారు.




