Anjali: చిన్న గ్యాప్.. గేమ్ చేంజర్ కి బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్న అంజలి.
అంజలి.. తెలుగు అమ్మాయి. అయినప్పటికీ తమిళ్ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది. షాపింగ్ మాల్ సినిమాతో వెండితెరకు పరిచమైయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అలరించిన అంజలి హీరోయిన్ గా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లోనూ నటిస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ్ భాషల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.. జర్నీ సినిమాతో మంచి విజయంతో పాటు గుర్తింపు సొంతం చేసుకుంది.