- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Devarakonda on director sandeep reddy vanga due to 10 years for arjun reddy movie Telugu Heroes Photos
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి – సందీప్ రెడ్డి వంగా పై విజయ్ దేవరకొండ ట్వీట్.!
కొన్ని సినిమాలు అంతే.. అందులో యాక్ట్ చేసిన వారికి అందరికీ ఓవర్‌నైట్‌లో పేరు తెచ్చిపెట్టేస్తాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో వాళ్లని పాపులర్ చేసేస్తాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు ఈ విషయాన్ని చాలా మంది విట్‌నెస్ చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అందరికీ నచ్చేసింది ఈ సినిమా. అఫ్‌కోర్స్ కొందరికి నచ్చలేదనుకోండి.. నచ్చని వారు చేసిన కామెంట్లు కూడా పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయని అనుకున్నారు కెప్టెన్ సందీప్‌రెడ్డి వంగా.
Updated on: Sep 02, 2024 | 2:30 PM

కొన్ని సినిమాలు అంతే.. అందులో యాక్ట్ చేసిన వారికి అందరికీ ఓవర్‌నైట్‌లో పేరు తెచ్చిపెట్టేస్తాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో వాళ్లని పాపులర్ చేసేస్తాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు ఈ విషయాన్ని చాలా మంది విట్‌నెస్ చేశారు.

అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అందరికీ నచ్చేసింది ఈ సినిమా. అఫ్‌కోర్స్ కొందరికి నచ్చలేదనుకోండి.. నచ్చని వారు చేసిన కామెంట్లు కూడా పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయని అనుకున్నారు కెప్టెన్ సందీప్‌రెడ్డి వంగా.

అర్జున్‌రెడ్డి విడుదలై ఏడేళ్లయింది అనేది న్యూస్. నిన్న మొన్న షూటింగ్ చేసినట్టుంది.. అప్పుడే ఏడేళ్లు కావడం ఏంటంటూ విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఆ ట్వీట్ వైరల్ కావడానికి ఇదొక్కటే కారణం కాదు.. అంతకు మించిన న్యూస్ ఉంది.. ఇంతకీ ఆ విషయాన్నీ మీరూ గమనించారా.?

యస్.. ది సందీప్ వంగా అర్జున్‌రెడ్డి ఫుల్ కట్‌ని పదో వార్షికోత్సవానికైనా విడుదల చేయండి అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రిలీజ్ అయిన అర్జున్‌రెడ్డిని చూసే చాలా మంది అప్పట్లో గగ్గోలు పెట్టారు.

ఇంత బోల్డ్ కంటెంట్ ఏంటి బాసూ అంటూ బాలీవుడ్ కబీర్ సింగ్‌ని చూసిన వారు కూడా రియాక్ట్ అయ్యారు. ఏడేళ్ల క్రితం అర్జున్‌రెడ్డి తీసిన సందీప్‌కీ, రీసెంట్‌గా యానిమల్ తీసిన సందీప్‌కీ ఏమాత్రం మార్పు లేదు.

వైజాగ్‌లో హిట్ 3 షూటింగ్‌లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది.




