- Telugu News Photo Gallery Cinema photos Heroine Bhagyashri Borse next movie shooting updates, details here Telugu Actress Photos
Bhagyashri Borse: హీరోయిన్ల కొరత టైమ్‌లో కలర్‌ఫుల్‌గా కనిపించిన భామ భాగ్యశ్రీ.. కానీ సీన్ రివర్స్.!
సినిమాల్లో ఎంతటి నటీనటులకైనా వెలుగు నీడలు ఎంత సేపు.. ఒక్క రిలీజ్ కెరీర్ మొత్తాన్ని తలకిందులుగా మార్చేస్తుంది. అప్పటిదాకా అనామకంగా ఉన్నవాళ్లను అర్ధరాత్రి స్టార్లను చేసేస్తుంది. ఎంత పెద్ద స్టార్లనైనా ఒక్క రిజల్ట్ తల్లడిల్లేలా చేస్తుంది. పేరున్న వారి విషయంలోనే ఇలా జరిగితే ఫస్ట్ మూవీతో పలకరించిన వారి సంగతేంటి.? టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత మామూలుగా లేదు అనుకుంటున్న టైమ్‌లో కలర్‌ఫుల్‌గా కనిపించిన భామ భాగ్యశ్రీ.
Updated on: Sep 02, 2024 | 3:39 PM

సినిమాల్లో ఎంతటి నటీనటులకైనా వెలుగు నీడలు ఎంత సేపు.. ఒక్క రిలీజ్ కెరీర్ మొత్తాన్ని తలకిందులుగా మార్చేస్తుంది. అప్పటిదాకా అనామకంగా ఉన్నవాళ్లను అర్ధరాత్రి స్టార్లను చేసేస్తుంది.

ఎంత పెద్ద స్టార్లనైనా ఒక్క రిజల్ట్ తల్లడిల్లేలా చేస్తుంది. పేరున్న వారి విషయంలోనే ఇలా జరిగితే ఫస్ట్ మూవీతో పలకరించిన వారి సంగతేంటి.? టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత మామూలుగా లేదు అనుకుంటున్న టైమ్‌లో కలర్‌ఫుల్‌గా కనిపించిన భామ భాగ్యశ్రీ.

మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయితే భాగ్యశ్రీ వేరే లెవల్లో బిజీ అవుతారని అంతా అనుకున్నారు. ఫస్ట్ సినిమా రిలీజ్‌కి ముందే ఆమెకు నాలుగైదు ఆఫర్లు క్యూలో ఉన్నాయని కూడా అనుకున్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా, భాగ్యశ్రీ నటకు మంచి మార్కులే పడ్డాయి. అయినా ఇప్పటిదాకా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చడీచప్పుడూ వినిపించడం లేదు.

గతంలో లైగర్ బ్యూటీ విషయంలో జరిగిందే, ఇప్పుడు భాగ్యశ్రీ విషయంలోనూ రిపీట్ అవుతోందా? అని అనుకుంటున్నారు జనాలు.. పూరి జగన్నాథ్ పరిచయం చేసే హీరోయిన్ అంటే, మినిమమ్ స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడటం ఖాయం అనే టాక్ వినిపించింది లైగర్ సమయంలో.

అలాగే తాజాగా రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామనే హీరోయిన్‌గా తీసుకున్నారు. మొత్తానికి భాగ్య శ్రీ దూకుడు చూస్తుంటే.. మరో కృతి శెట్టి, శ్రీలీల అయ్యేలా కనిపిస్తున్నారు.

అందం. అభినయం ఉండి.. మంచి అవకాశాల కోసం ఇంత మంది ఎదురుచూస్తున్నా.. టాలీవుడ్‌కి హీరోయిన్లు కావలెను అనే బోర్డు మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటుందంటున్నారు క్రిటిక్స్.




