- Telugu News Photo Gallery Cinema photos Manchu lakshmi interesting comments on hema committee report
Lakshmi Manchu: మగాళ్లు ఎవ్వరూ స్పందించడం లేదు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే చాలా మంది తమకు జరిగిన చేదు అనుభవాలను దైర్యంగా చెప్పుకుంటున్నారు. దీని పై మంచు లక్ష్మీ కూడా స్పందించారు.
Updated on: Sep 02, 2024 | 2:19 PM

మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే చాలా మంది తమకు జరిగిన చేదు అనుభవాలను దైర్యంగా చెప్పుకుంటున్నారు. దీని పై మంచు లక్ష్మీ కూడా స్పందించారు.

కెరీర్ స్టార్టింగ్ లో తాను కూడా లైంగిక వేధింపుల బారిన పడ్డాను అని తెలిపారు మంచు లక్ష్మీ.. అయితే ఆ సమస్యను తాను ఎంతో దైర్యంగా ఎదురుకున్నాను అని తెలిపింది. అలాగే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే నిలదీయాలని ఆమె అన్నారు.

తాజాగా మంచు లక్ష్మీ టాలీవుడ్ హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయం గురించి దైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వారిని ప్రశంసించింది మంచు లక్ష్మీ.

ప్రతి పరిశ్రమ హేమ కమిటీ నివేదిక నుండి స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. అలాగే టాలీవుడ్ లో మగవాళ్ళు ఎవరూ బయటకు వచ్చి మీటూకు మద్దతు ఇవ్వడం లేదు. అది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ఆమె అన్నారు.

కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఆ సంఖ్య సరిపోదు. నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడితే నాకు పోయేది ఏమీ లేదు. కానీ కొంతమంది మహిళలు బయటకు రాలేకపోతున్నారు. వారు చాలా కోల్పోతారని ఆలోచిస్తున్నారు అని మంచు లక్ష్మీ అన్నారు.




