- Telugu News Photo Gallery Cinema photos Hero King Nagarjuna acted in negative role in coolie movie and his next movies Telugu Heroes Photos
Nagarjuna: కింగ్ నాగార్జున ప్లాన్ బీ.. వర్కవుట్ అవుతుందా.? నాగ్ ప్లాన్ ఏంటి.?
ఎక్స్ పీరియన్స్డ్ పీపుల్ ఎప్పుడూ ఒక్క ప్లాన్‌కే స్టికాన్ అవ్వరు. ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోతే వెంటనే ప్లాన్ బీకి షిఫ్ట్ అవుతారు. అది కూడా అంతంతమాత్రంగా సాగితే, ఉండనే ఉంటుంది ప్లాన్ సీ.. ఈ కేటగిరీలో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కనిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఫాలో అవుతున్న ప్లానింగ్ ఏంటి.? సినిమాలు సోలోగా క్లిక్ కాకపోతే, మల్టీస్టారర్ ఆప్షన్ ఉండనే ఉంది కదా అనుకున్నట్టున్నారు కింగ్ నాగార్జున.
Updated on: Sep 01, 2024 | 6:48 PM

ఎక్స్ పీరియన్స్డ్ పీపుల్ ఎప్పుడూ ఒక్క ప్లాన్‌కే స్టికాన్ అవ్వరు. ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోతే వెంటనే ప్లాన్ బీకి షిఫ్ట్ అవుతారు. అది కూడా అంతంతమాత్రంగా సాగితే, ఉండనే ఉంటుంది ప్లాన్ సీ..

ఈ కేటగిరీలో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కనిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఫాలో అవుతున్న ప్లానింగ్ ఏంటి.? సినిమాలు సోలోగా క్లిక్ కాకపోతే, మల్టీస్టారర్ ఆప్షన్ ఉండనే ఉంది కదా అనుకున్నట్టున్నారు కింగ్ నాగార్జున.

వరుసగా అలాంటి ప్రాజెక్టులకే సైన్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్రలో కింగ్ నాగ్ చేసిన రోల్ చూశాక, స్పెషల్, ప్రామినెంట్ రోల్స్ కి ఆయన్ని అప్రోచ్ కావచ్చనే ఫీలింగ్ వచ్చేసింది మేకర్స్ కి.

ఎట్ ప్రెజెంట్ ధనుష్‌తో కుబేర సినిమాలో కలిసి నటిస్తున్నారు కింగ్. శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో నాగ్‌తో ధనుష్ చేస్తున్నారని చెప్పాలంటున్నారు అక్కినేని అభిమానులు.

ఎవరు, ఎవరితో కలిసి చేసినా, బిజినెస్ మాత్రం ఇద్దరి మీదే జరగాలి.. కలెక్షన్లూ ఇద్దరిని చూసే కురవాలన్నది కాన్సెప్ట్. నాగ్ బర్త్ డే గిఫ్ట్ గా ఆయన లుక్‌ని రిలీజ్ చేసింది కూలీ టీమ్.

లోకేష్ కెప్టెన్సీలో కూలీలో నటిస్తున్నారు నాగ్. సీనియర్ హీరోలని స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్.

ఇప్పుడు రజనీకాంత్ నీ, నాగ్‌నీ ఎలా చూపిస్తారోనని ఎగ్జయిట్ అవుతున్నారు అభిమానులు. ప్లాన్ బీలో నాగ్ తప్పకుండా సక్సెస్ చూస్తారన్నది వారికున్న క్లారిటీ.!




