- Telugu News Photo Gallery Cinema photos Guess This Actress In This Photo She Is Tollywood Heroine Madonna Sebastian
Tollywood : చేసిన సినిమాలన్ని సూపర్ హిట్.. అయినా రానీ క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే వారి పర్సనల్ విషయాలపై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ అందాల తార లేటేస్ట్ ఫోటో మాత్రం నెటిజన్లను తికమకపెట్టేస్తోంది. టాలీవుడ్ అడియన్స్కు ఆమె సుపరిచితమే. అందం, అంతకు మించిన సహజ అభినయం ఈ వయ్యారి సొంతం.
Updated on: Jan 29, 2025 | 10:35 PM

గ్లామర్ పాత్రలే కాదు.. కంటెంట్ ఉండే సెకండ్ లీడ్ రోల్స్ చేయడానికైనా సిద్ధమవుతుంది. చిన్నా, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కథ, కథనానికి ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనే హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2015లో మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది.

అలాగే తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో రీమేక్ అయిన ప్రేమమ్ సినిమాలోనూ ఈ భామ కనిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే ఆమెకు మొదటి సినిమా.

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల ఆఫర్స్ అందకున్నప్పటికీ స్టార్ రేంజ్ గుర్తింపు మాత్రం రాలేదు. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది మడోన్నా.

ఇటీవలే లియో సినిమాలో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో విజయ్ చెల్లి ఎలీషా దాస్ పాత్రలో కనిపించింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మడోన్నా.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.




