- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress In This Photo She Is Tollywood Heroine Shraddha Srinath Chilhood Photo
Tollywood: హీరోయిన్లలో ఈ అమ్మడు చాలా స్పెషల్.. గ్లామర్ కాదు.. కంటెంట్ ముఖ్యమంటున్న బ్యూటీ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. అందం, అభినయంతో మెప్పించి.. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈబ్యూటీకి ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే.. తనే హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
Updated on: Sep 03, 2024 | 8:24 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. అందం, అభినయంతో మెప్పించి.. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈబ్యూటీకి ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే.. తనే హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్.

న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఇందులో శ్రద్ధా నటనపై ప్రశంసలు కురిపించారు. కానీ తెలుగులో అవకాశాలు రాలేదు.

చివరగా విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా మినహా మరో ప్రాజెక్ట్ లేనట్లు తెలుస్తోంది.

గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలు చేసేందుకు కూడా రెడీ అంటుంది. కానీ ఆ పాత్రలకు సినిమాలో గొప్పదనం కూడా ఉండాలంటుంది. అందుకే తాను సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుందట.

తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్.. మలయాళంలో 2015లో వచచిన కోహినూర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.




