- Telugu News Photo Gallery Cinema photos Guess the Actor In This Photo He Is Guppedantha Manasu Serial Rishi Alias Mukesh Gowda
Tollywood: ఈ చిన్నోడు బుల్లితెరపై క్రేజీ హీరో.. అమ్మాయిల ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..
వెండితెరపై హీరోలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో.. అదే స్తాయిలో బుల్లితెరపై సీరియల్స్ చేసే పలువురు కుర్రాలకు అంతే ఫాలోయింగ్ ఉంటుంది. నిత్యం సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించే అబ్బాయిలను తమ కుటుంబసభ్యులుగానే చూస్తుంటారు ఫ్యామిలీ అడియన్స్.
Updated on: Oct 11, 2024 | 1:37 PM

వెండితెరపై హీరోలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో.. అదే స్తాయిలో బుల్లితెరపై సీరియల్స్ చేసే పలువురు కుర్రాలకు అంతే ఫాలోయింగ్ ఉంటుంది. నిత్యం సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించే అబ్బాయిలను తమ కుటుంబసభ్యులుగానే చూస్తుంటారు ఫ్యామిలీ అడియన్స్.

ప్రస్తుతం ఓ సీరియల్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. ఇప్పటివరకు టెలివిజన్ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నిరుపమ్ పరిటాల. కార్తీక దీపం సీరియల్తో ఏడు సంవత్సరాలు తిరుగులేని చక్రం తిప్పారు. ఇక నిరుపమ్ తర్వాత అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇతనే. అతడే రిషి

రిషి.. ఈ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లోని సీరియల్ లవర్స్ ఇట్టే గుర్తుపడతారు. బుల్లితెరపై టాప్ స్థానంలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి అలియాస్ రిషేంద్ర భూషణ్. ఈ కుర్రాడి అసలు పేరు ముఖేష్ గౌడ.

మోడలింగ్తో కెరియర్ స్టార్ట్ చేసిన ముఖేష్ గౌడ.. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. నాగకన్నిక అనే సీరియల్ తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు.

ఆ తర్వాత ప్రేమనగర్ సీరియల్ తో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ సీరియల్ తర్వాత ముఖేష్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. రిషి అంటే ఇగో పర్సన్.. తల్లంటే చెప్పలేనంత కోపం. అయినా.. వసుధారతో రిషి లవ్ ట్రాక్.. తల్లి జగతితో రిషి నటించిన తీరు అభిమానులకు తెగ నచ్చేసింది.



















