- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR Will be Ready to Participate with War 2 Movie shooting with Hrithik Roshan After Devara Success, Details here, Telugu Heroes Photos
NTR-War 2: దేవర ఇలా అయిందో లేదో అప్పుడే వార్ 2 అంటూ యుద్ధానికి వెళ్తున్న తారక్.
దేవరతో రప్ఫాడిస్తున్న ఎన్టీఆర్.. ఇప్పట్లో బ్రేక్ తీసుకునేలా కనిపించట్లేదు. దేవర ఇలా అయిందో లేదో అప్పుడే వార్ 2 అంటూ యుద్ధానికి వెళ్తున్నారు తారక్. ఈ చిత్ర లేటెస్ట్ అప్‌డేట్స్ వింటుంటే ఫ్యాన్స్‌కు పూనకాలయితే ఖాయం. ఒకటి రెండూ కాదు.. పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి మరి. దేవర సినిమాతో దూకుడు చూపిస్తున్నారు తారక్.
Updated on: Oct 11, 2024 | 8:35 PM

దేవరతో రప్ఫాడిస్తున్న ఎన్టీఆర్.. ఇప్పట్లో బ్రేక్ తీసుకునేలా కనిపించట్లేదు. దేవర ఇలా అయిందో లేదో అప్పుడే వార్ 2 అంటూ యుద్ధానికి వెళ్తున్నారు తారక్.

ఈ చిత్ర లేటెస్ట్ అప్‌డేట్స్ వింటుంటే ఫ్యాన్స్‌కు పూనకాలయితే ఖాయం. ఒకటి రెండూ కాదు.. పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి మరి.

దేవర సినిమాతో దూకుడు చూపిస్తున్నారు తారక్. బాలీవుడ్‌లోనూ అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్‌తో వచ్చిన గుర్తింపును దేవరతో మరింత పెంచుకున్నారీయన.

ఇప్పుడు వార్ 2తో ఆ మార్కెట్ డబుల్ అవుతుందని చూస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై మేజర్ అప్‌డేట్ వచ్చింది. వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఇప్పటికే తారక్, హృతిక్ రోషన్‌పై వచ్చే సోలో సీన్స్ అన్నీ పూర్తి చేసారు దర్శకుడు అయన్ ముఖర్జీ. తాజాగా ఫేస్ ఆఫ్ సీన్స్‌పై ఫోకస్ చేసారు. నవంబర్ మొదటి వారంలో క్లైమాక్స్ షూట్ జరగనుంది.

దానికంటే ముందే ముంబై వెళ్లనున్నారు తారక్. దసరా తర్వాత ఎన్టీఆర్‌పై కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారు అయన్. ఇండియన్ స్క్రీన్‌పై నెవర్ బిఫోర్ అన్నట్లు క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారు అయన్. యాక్షన్ పార్ట్ కూడా అలాగే ఉండబోతుంది.

ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పార్ట్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీక్వెల్‌లో హృతిక్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్.





























