పోటీకి సిద్ధమైన జాన్వీ కపూర్.. దిశా పటాని.. ఇంతకీ రేస్ లో గెలిచేది ఎవరంటే ??
ఎవరైనా ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇస్తారు. ఎక్కడైనా అంతే. కానీ, బాలీవుడ్ హీరోయిన్లలో ఆ ఇద్దరికి మాత్రం ఒకటికి రెండు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఒకదానితో కాకపోయినా ఇంకోదానితో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ ఇద్దరూ... ఇంతకీ ఎవరు వారూ.. అని అంటున్నారా? జాన్వీ కపూర్ అండ్ దిశా పటాని అండీ... డీటైల్స్ చూసేద్దాం రండి... తారక్‌తో జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో తంగం అంటూ ముద్దుగా పిలుస్తున్నారు జాన్వీకపూర్‌ని. ప్రస్తుతం శంషాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది దేవర.
Updated on: May 04, 2024 | 6:56 AM

ఎవరైనా ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇస్తారు. ఎక్కడైనా అంతే. కానీ, బాలీవుడ్ హీరోయిన్లలో ఆ ఇద్దరికి మాత్రం ఒకటికి రెండు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఒకదానితో కాకపోయినా ఇంకోదానితో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ ఇద్దరూ... ఇంతకీ ఎవరు వారూ.. అని అంటున్నారా? జాన్వీ కపూర్ అండ్ దిశా పటాని అండీ... డీటైల్స్ చూసేద్దాం రండి...

తారక్‌తో జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో తంగం అంటూ ముద్దుగా పిలుస్తున్నారు జాన్వీకపూర్‌ని. ప్రస్తుతం శంషాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది దేవర.

ఇవాళ, రేపూ అంటూ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇన్నాళ్లూ ఊరించారు జాన్వీ. ఈ అక్టోబర్‌లో అఫిషియల్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికి చరణ్ తో కలిసి లొకేషన్‌లో ఆడిపాడుతుంటారు ఈ బ్యూటీ.

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాయికగా నటిస్తున్నారు జాన్వీ. ఒక సినిమా రిలీజ్ కాకముందే ఇంకో సినిమాలో అవకాశం రావడం మామూలు విషయం కాదు. వచ్చిన ఛాన్సులను ప్రూవ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు వెల్ విషర్స్. సేమ్ అడ్వైజ్‌ని అందుకుంటున్నారు దిశా పటాని

ఆల్రెడీ తెలుగులో వరుణ్‌తేజ్‌తో లోఫర్‌లో నటించారు దిశా పటాని. ఆ సినిమా కలిసి రాలేదు. అందుకే ఇన్నేళ్లపాటు తెలుగుకు దూరంగా ఉన్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేశారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో ప్రభాస్‌తో కల్కిలో నటించారు. సూర్య కంగువలోనూ ఈమే నాయిక. సో ఈ ఏడాది నుంచి వెంటవెంటనే సౌత్‌లో లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు దిశ.




