- Telugu News Photo Gallery Cinema photos Fans Excited on Mahesh Babu And pawan Kalyan Doing First Time Pan India Films in 2024 Telugu Heroes Photos
Mahesh Babu VS Pawan Kalyan: ఇప్పటి వరకు మహేష్ , పవన్ పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చెయ్యలేదు.?
తారీఖులు, దస్తావేజులతో పనేం ఉంది అని అనుకునే రోజులు కావివి. ఇప్పుడు ఎవ్రీ డేట్, ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంటే. అందులోనూ 2024ని సూపర్‌స్టార్ అండ్ పవర్‌స్టార్ ఫ్యాన్స్ అసలు మర్చిపోలేరు. ఇద్దరికీ ఈ ఇయర్ చాలా చాలా కీలకం. ఆ ఇద్దరు స్టార్లకీ అంత ముఖ్యమైన విషయాలు ఏం ఉన్నాయి ఈ ఏడాదిలో.? రీజినల్ కుర్చీ మడతపెట్టి, ఇంటర్నేషనల్ కంఫర్ట్ సీటింగ్‌కి షిఫ్ట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.
Updated on: Apr 29, 2024 | 8:58 PM

తారీఖులు, దస్తావేజులతో పనేం ఉంది అని అనుకునే రోజులు కావివి. ఇప్పుడు ఎవ్రీ డేట్, ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంటే. అందులోనూ 2024ని సూపర్‌స్టార్ అండ్ పవర్‌స్టార్ ఫ్యాన్స్ అసలు మర్చిపోలేరు.

ఇద్దరికీ ఈ ఇయర్ చాలా చాలా కీలకం. ఆ ఇద్దరు స్టార్లకీ అంత ముఖ్యమైన విషయాలు ఏం ఉన్నాయి ఈ ఏడాదిలో.? రీజినల్ కుర్చీ మడతపెట్టి, ఇంటర్నేషనల్ కంఫర్ట్ సీటింగ్‌కి షిఫ్ట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.

ల్యాంగ్ హెయిర్‌తో మేకోవర్ కావడం, స్కేటింగ్ క్లాసెస్, ఫిట్‌నెస్ కోచింగ్‌కి అటెండ్ అవ్వడం... ఇలా ఒకటా, రెండా? అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు అన్ని విధాలా తనని తాను సిద్ధం చేసుకుంటున్నారు సూపర్ స్టార్. ఇన్నాళ్లూ ఒక ఎత్తు. అంతా టాలీవుడ్‌లోనే జరిగింది.

ఇకపై మాత్రం సీన్ ఇంకోలా ఉండబోతోందని చెప్పకనే చెప్పేస్తున్నారు జక్కన్న. రాజమౌళి ఇచ్చిన సలహాలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు మహేష్. ఆయన సరిహద్దుల్ని చెరిపేసి ప్యాన్ ఇండియా ప్రయాణం ప్రారంభిస్తున్నది 2024లోనే.

ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు పవర్‌స్టార్. ఓ వైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్నా, పవన్ సినిమాల అప్‌డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటును తీరుస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్‌నే ఎందుకు టార్గెట్ చేసినట్టు?

దాంతో పాటు ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కల్యాణ్ హాజరయ్యే ఫస్ట్ లొకేషన్ ఏదనే విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు జనాలు. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే హరిహరవీరమల్లు ఈ ఏడాదే విడుదలవుతుందా? లేకుంటే 2025 సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి.

ఇటు పవన్ అయినా, అటు మహేష్ అయినా, ప్యాన్ ఇండియా ఎక్స్ పీరియన్స్ ఉన్న కెప్టెన్లతోనే ట్రావెల్ చేయడం చాలావరకు హెల్ప్ అయ్యే విషయం అని ఖుషీ అవుతున్నారు అభిమానులు.




