- Telugu News Photo Gallery Cinema photos Fans are starting discussions comparing Pawan Kalyan and Ajith Kumar
Pawan VS Ajith: ఇక్కడ పవన్.. అక్కడ అజిత్.. దారులు వేరైనా.. గమ్యం మాత్రం ఒకటే..
మామూలుగా సినిమాల విషయంలో ఇక్కడ పవన్ కల్యాణ్.. తమిళనాడులో విజయ్‌ని పోలుస్తుంటారు. కానీ చరిష్మా పరంగా ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కీ, అజిత్‌కీ మధ్య కంపేరిజన్ కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది సినిమాల విషయంలో వీరిద్దరినీ పోలుస్తూ చర్చలు షురూ చేస్తున్నారు ఫ్యాన్స్.
Updated on: Jan 26, 2025 | 7:03 PM

మామూలుగా సినిమాల విషయంలో ఇక్కడ పవన్ కల్యాణ్.. తమిళనాడులో విజయ్‌ని పోలుస్తుంటారు. కానీ చరిష్మా పరంగా ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కీ, అజిత్‌కీ మధ్య కంపేరిజన్ కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది సినిమాల విషయంలో వీరిద్దరినీ పోలుస్తూ చర్చలు షురూ చేస్తున్నారు ఫ్యాన్స్.

హరిహరవీరమల్లు సాంగ్ విని పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అదీ.. మా పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. పక్కా జానపదం ఆయన గొంతులో పడితే వేరే లెవల్లో వినిపిస్తుందంటూ లిరిక్స్‌ని వైరల్ చేస్తున్నారు. హరిహరవీరమల్లు టీమ్ ఇదే జోరు కంటిన్యూ చేస్తే చెప్పిన టైమ్‌కి థియేటర్లలో వాలడం పక్కా అన్నది అందరి నమ్మకం.

ఇటు హరిహరవీరమల్లు ఆన్ టైమ్‌కి వచ్చేస్తే, ఓజీ సినిమా కూడా ఇయర్ ఎండింగ్‌లోపు ప్రేక్షకులను పలకరించడం ఖాయం అన్నది ట్రేడ్ పండిట్స్ లో వినిపిస్తున్న మాట. అదే జరిగితే ఈ ఏడాది ఒకటికి రెండు సినిమాలతో ఆడియన్స్‌కి హలో చెప్పేస్తారు పవన్ కల్యాణ్.

లాస్ట్ ఇయర్ సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్న స్టార్లలో మన దగ్గర పవన్ ఉంటే, తమిళనాడులో అజిత్ కూడా ఉన్నారు. ఇక్కడ పవన్ రాజకీయాల్లో గెలిస్తే, అక్కడ అజిత్ తనకు నచ్చిన రేసింగ్‌లో దూసుకుపోయారు. కానీ ఈ ఏడాది ఆయన పట్టుదలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అంటున్నారు.

పట్టుదల సినిమా మాత్రమే కాదు, గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఈ ఏడాదే విడుదల చేయాలన్నది అజిత్ ప్లాన్. ముందనుకున్న ప్రకారమైతే, ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు మేకర్స్. నెక్స్ట్ బిగ్గెస్ట్ సీజన్ చూసుకుని గుడ్ బ్యాడ్ అగ్లీని రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ మాత్రం గట్టిగానే జరుగుతోంది.





























