Toxic: టాక్సిక్ టీమ్ నుంచి మరో కాస్టింగ్ అప్డేట్
కేజీఎఫ్ 2 తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్... ప్రజెంట్ నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటేందుకు అలాంటి కాన్సెప్ట్‌తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇన్నాళ్లు ఈ సినిమాకు సంబంధించి ఒక్క కాస్టింగ్ అప్‌డేట్ కూడా ఇవ్వని మేకర్స్, ఫైనల్‌గా లీడ్ రోల్‌లో కనిపించబోయే ఈ సీనియర్ బ్యూటీ పేరు రివీల్ చేశారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jan 26, 2025 | 8:37 PM

కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్న యష్, ఫైనల్‌గా కేజీఎఫ్ స్టైల్‌లోనే ప్లాన్ చేసిన టాక్సిక్ అనే సినిమాకు ఓకే చెప్పారు.

కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్న యష్, ఫైనల్‌గా కేజీఎఫ్ స్టైల్‌లోనే ప్లాన్ చేసిన టాక్సిక్ అనే సినిమాకు ఓకే చెప్పారు.

ఆల్రెడీ కథ డ్రగ్ మాఫియా నేపథ్యంలో అన్న క్లారిటీ ఇచ్చిన యూనిట్, టీజర్‌లోనూ అదే విషయాన్ని రివీల్ చేశారు. డిస్కో బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్ లుక్‌లో యష్‌ను ప్రజెంట్ చేశారు. కానీ ఈ అప్‌డేట్‌లోనూ మిగతా కాస్టింగ్ ఏంటి..?అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.

లేటెస్ట్ ఇంటర్య్వూలో టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తున్నారన్న విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు నటుడు అక్షయ్ ఒబెరాయ్. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌లో నయనతారతో కలిసి పాల్గొంటున్నానని క్లారిటీ ఇచ్చారు.

దీంతో టాక్సిక్‌లో నయన్ నటిస్తున్నారన్న విషయంలో అఫీషియల్ క్లారిటీ వచ్చింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతున్నా... ఈ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.





























