- Telugu News Photo Gallery Cinema photos Everything is ready for the big announcement of Hero Vijay thalapathy last Movie Telugu Heroes Photos
Vijay Thalapathy: విజయ్ చివరి సినిమాపై బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..!
30 ఏళ్ళ కెరీర్.. 68 సినిమాలు.. లెక్కపెట్టలేని క్రేజ్.. అంతులేని ఇమేజ్.. కోట్లాది మంది అభిమానం.. అన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. తన చివరి సినిమా అనౌన్స్‌మెంట్ చేసారు దళపతి విజయ్. ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క సినిమా చేయబోతున్నారీయన. దాని ప్రకటనే ఇప్పుడొచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా..? ఆయన రెమ్యునరేషన్ ఎంత..? మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో..
Updated on: Sep 14, 2024 | 7:46 PM

తాజాగా ఆయన మొదటి రాజకీయ సభ భారీగా జరిగింది. తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకు ముడి పెడుతుంటారు.. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటి ఉంటుందా..! ఇప్పుడిదే జరిగింది.

ఎప్పట్నుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ.. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి వస్తున్నా అంటూ ప్రకటించారు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు విజయ్.

తొలి రాజకీయ సభ ఇలా చెప్పారో లేదో.. అప్పుడే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు విజయ్. తమిళనాట ఒకే కుటుంబం అవినీతి పాలన చేస్తుందంటూ విరుచుకుపడ్డారు దళపతి. డబ్బు తీసుకుని ఓటేసే రాజకీయం పోవాలి.. సమానత్వం రావాలంటూ తన నినాదం బలంగా చెప్పుకొచ్చారు విజయ్.

అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయినా దళపతి 69 రీమేక్ అన్న వార్తలపై చిత్రయూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేయబోతున్నారీయన. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌లో విజయ్ చివరి సినిమా ఉండబోతుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కరోజులో అయింది కాదు.. చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారీయన. ఎప్పటికప్పుడు అభిమాన సంఘాలతోనూ చర్చిస్తున్నారు. ఇప్పుడిక నేరుగా రాజకీయ రణక్షేత్రంలో అడుగు పెట్టారు. రాజకీయాల కోసమే ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు విజయ్.

ఇకపై ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు కలిపి బ్యాలెన్స్ చేయబోతున్నారా..? విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహమేంటి..? సినిమాలు చేస్తారా చేయరా.? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 8 నెలలు దాటిపోయింది.




