Ram Charan – RC16: రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..

గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్సైనా.. పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగ బట్టినపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.? రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. అందుకే ప్లాన్ మార్చేసారు మెగా వారసుడు. ఇక చూస్కోండి నా జోరు.. ఇప్పట్నుంచి కనిపించేది రామ్ చరణ్ 2.0 అంటున్నారాయన. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి.? నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్‌డేట్స్ ఏంటి.? అదేంటో కానీ కెరీర్ మొదట్నుంచీ రామ్ చరణ్‌ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది.

Anil kumar poka

|

Updated on: Sep 14, 2024 | 11:30 PM

అక్టోబర్ 30న థర్డ్ సింగిల్‌ రిలీజ్‌ కానుంది. 20 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందించిన ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌ అన్న టాక్ వినిపిస్తోంది.

1 / 7
సోలో హీరోగా చెర్రీ చేసిన లాస్ట్ సినిమా వినయ విధేయ రామా. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఆ మాటకొస్తే రంగస్థలం తర్వాత సోలో హీరోగా పర్ఫెక్ట్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు రామ్‌చరణ్‌.

2 / 7
ఈ నెల 9న లక్నోకి వచ్చేస్తున్నామంటూ ఢంకా భజాయించి మరీ చెప్పేస్తున్నారు. లక్నోలో ఈవెంట్‌ కంప్లీట్‌ చేయగానే ముంబైలో ఎలాగూ భారీ మీట్‌ ప్లాన్‌ చేస్తారు.

3 / 7
2009లో మగధీర నుంచి 2019లో వినయ విధేయ రామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేసారు.. మధ్యలో 2011, 2017 మాత్రమే ఖాళీగా వదిలేసారు చరణ్. కానీ రాజమౌళితో RRR ఎప్పుడైతే కమిటయ్యారో.. అప్పట్నుంచి గ్యాప్ తప్పట్లేదు.

4 / 7
ట్రిపుల్‌ ఆర్‌తో గ్లోబల్‌స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు చెర్రీ. అయితే, ట్రిపుల్‌ ఆర్‌ క్రెడిట్‌ తారక్‌ అండ్‌ చెర్రీ ఇద్దరిదీ.  చరణ్‌ ఆ తర్వాత చేసిన ఆచార్య కూడా మెగాస్టార్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నదే.

5 / 7
ఈ సినిమా డిసెంబర్ 20న వస్తుందంటున్నారు. ఆ మధ్య బుచ్చిబాబుతో RC16కి ముహూర్తం పెట్టారు చరణ్. దీని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి.. ఇంకా చెప్పాలంటే దసరా తర్వాత నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నారు బుచ్చిబాబు.

6 / 7
కేవలం ఆర్నెళ్లలోనే RC16 షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారీయన. 2025 సెకండాఫ్‌లో ఈ చిత్రం రావడం ఖాయం. దాంతో పాటే సుకుమార్‌తోనూ సినిమా ప్రకటించారు రామ్ చరణ్. పుష్ప 2 తర్వాత సుక్కు చేయబోయే సినిమా ఇదే. ఈ మూడు సినిమాల్ని 2026 సమ్మర్‌లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్.

7 / 7
Follow us