ఇది కదా మాక్కావాల్సింది... ఇది కదా మేం కోరుకుంది అని అంటున్నారు తారక్ అభిమానులు. ఒక్క అప్‌డేట్ ప్లీజ్.. ఒకే ఒక్క అప్‌డేట్ ఇవ్వండి అంటూ రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడితేగానీ అప్‌డేట్లు ఉండని ఈ రోజుల్లో.. జస్ట్ తన స్టూడియో విజిట్ చేసినందుకే పాట చేసిన మ్యూజిక్ డైరక్టర్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.