Pooja Hegde: కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్ కోసం ట్రైల్స్..
నార్త్ లో రష్మిక మందడుగేస్తే, సౌత్‌లో ఓ హిట్ ఫ్రాంఛైజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మిస్ పూజా హెగ్డే. రాఘవ లారెన్స్ కెరీర్‌లో కాంచన సీరీస్ ఎంత పెద్ద హిట్టో స్పెషల్‌గా పరిచయం చేయక్కర్లేదు. ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంఛైజీలో ఫోర్త్ చాప్టర్‌కి సైన్ చేశారట పూజా. సౌత్‌లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ట్రై చేస్తున్న పూజా హెగ్డే కి కాంచన పర్ఫెక్ట్ మూవీ అంటున్నారు క్రిటిక్స్. ఆల్రెడీ సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు మేడమ్ పూజా.