- Telugu News Photo Gallery Cinema photos During Operation Sindoor, people are reminiscing about the soldier movies that came out in recent times.
Patriotic Movies: ఆపరేషన్ సిందూర్ వేళ.. ఆ సినిమాలు గుర్తు చేసుకున్న ప్రేక్షకులు..
ఆపరేషన్ సిందూర్ గురించి యావత్ భారతం మాట్లాడుకుంటున్న వేళ... సిల్వర్ స్క్రీన్ మీద రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సైనికుల సినిమాల గురించి గుర్తుచేసుకుంటున్నారు జనాలు. ఇంతకీ ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్న ఆ సినిమాలు ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం..
Updated on: May 10, 2025 | 9:59 AM

అల్లర్లలో చిక్కుకున్న హీరోయిన్‌ని కాపాడటానికి తన భార్య అని పరిచయం చేస్తాడు హీరో.. సీతారామమ్ కథంతా ఆ సన్నివేశం చుట్టూ ముడిపడి ఉంటుంది. ఆ సన్నివేశం కశ్మీర్‌లో తీసిందే. అదొక్కటేనా? సినిమాలో జవాన్ల ఎమోషన్‌ని కళ్లకు కట్టారు మేకర్స్.

ఆ మధ్య వచ్చిన సీతారామమ్ మాత్రమే కాదు, అమరన్ సినిమా కూడా జవాన్ల లైఫ్‌ని కళ్ల ముందు నిలిపింది. ఇన్‌స్పయర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటూ 2001లో కశ్మీర్‌లో సిట్చువేషన్‌ని కళ్ల ముందు నిలిపే ప్రయత్నం చేసింది గ్రౌండ్ జీరో టీమ్. పాత విషయాలను కొత్తగా చెప్పినందుకు మేకర్స్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా రిలీజ్ టైమ్‌కి ముందే స్కై ఫోర్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు నార్త్ మేకర్స్. సినిమా భారీగా వసూళ్లు కురిపించి బ్లాక్ బస్టర్ అనిపించకపోయినా మంచి సినిమా అనే ముద్ర పడింది స్కై ఫోర్స్ మూవీ మీద.

దాదాపుగా ఇదే కంటెంట్‌తో తెలుగులో ఆపరేషన్ వేలంటైన్ రిలీజ్ అయింది. వరుణ్ తేజ్, మనుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పించలేకపోయింది. దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఆలివ్ గ్రీన్ డ్రస్సుల్లో హీరోలు ఎంతగా హల్ చల్ చేసినా, స్పెషల్ ముద్ర వేసింది మాత్రం షేర్షా మూవీ. గ్రౌండ్ రియాలిటీ, వార్ దృశ్యాలు, ఎమోషనల్ కంటెంట్ అంటూ ఎప్పటికీ మనస్సులో నిలిచిపోతుంది షేర్‌షా.




