- Telugu News Photo Gallery Cinema photos Another star hero in Mollywood is getting ready to grab the megaphone
Hero Director: వారి దారిలోనే మాలీవుడ్ హీరో.. మెగాఫోన్ పట్టనున్న మలయాళీ స్టార్..
మాలీవుడ్‌లో మరో స్టార్ హీరో మెగాఫోన్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో మలయాళ హీరోలు దర్శకులుగా మంచి సక్సెస్‌లు సాధిస్తున్నారు. అందుకే యంగ్ జనరేషన్ హీరోలు కూడా ఇదే బాటలో నడిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎవరా మలయాళీ స్టార్ హీరో.? ఆ సినిమా ఏంటి.? ఈరోజు ఇందులో చూద్దామా..
Updated on: May 10, 2025 | 10:30 AM

మాలీవుడ్‌లో రీసెంట్ బ్లాక్ బస్టర్ ఎల్ 2 ఎంపురాన్. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. మాలీవుడ్‌లో డైరెక్టర్‌గా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన పృథ్వీరాజ్, నటుడిగా కంటిన్యూ అవుతూనే దర్శకుడిగానూ తన మార్క్ చూపిస్తున్నారు.

మాలీవుడ్‌లో డైరెక్షన్, యాక్టింగ్ చేస్తూనే.. ఇతర ఇండస్ట్రీస్‌లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు పృథ్వీరాజ్. 2023లో రజినికాంత్ జైలర్ మూవీలో నెగటివ్ పాత్రలో కనిపించారు. అదే ఏడాది తెలుగులో సలార్ మూవీలో దేవా స్నేహితుడు వరదరాజ మన్నార్ పాత్రలో కనిపించిన దీని పార్ట్ 2లో పూర్తి నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ మధ్యే మోహన్‌లాల్ కూడా దర్శకుడి మారారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ బరోజ్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. తొలి సినిమానే త్రీడీలో ఫాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందించి ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా... దర్శకుడిగా మోహన్‌లాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు ఉన్నిముకుందన్. మార్క్ సినిమాతో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ సృష్టించిన ఉన్ని, సూపర్ హీరో మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు.

Unni Mukundan




