- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Bus Stop Movie Heroine Sri Divya, How She Is Looks Now
Bus Stop Movie: ‘బస్ స్టాప్’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే.. ఫోటోస్ వైరల్..
డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో బస్ స్టాప్ ఒకటి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో ప్రిన్స్ సెసిల్, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటించారు. 2012లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా యూత్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శ్రీదివ్య. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ..
Updated on: Sep 17, 2024 | 9:58 AM

డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో బస్ స్టాప్ ఒకటి. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో ప్రిన్స్ సెసిల్, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటించారు. 2012లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా యూత్‌ను ఆకట్టుకుంది.

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శ్రీదివ్య. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ మరికొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదివ్య.. ఆ తర్వాత కథానాయికగా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. ఆ తర్వాత మనసారా సినిమాతో హీరోయిన్ గా మారింది.

తెలుగులో మనసారా, కేరింత, సైజ్ జీరో వంటి చిత్రాల్లో అలరించింది. ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదివ్య.. కొన్నాళ్లుగా వెండితెరపై కనిపించడం లేదు. పెళ్లి తర్వాత చాలాకాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోస్ సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా మెరున్ కలర్ పట్టు చీరలో మరింత అందంగా మెరిసిపోయింది. ఇప్పుడు శ్రీదివ్య లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.




