- Telugu News Photo Gallery Cinema photos Do You Know this Actess who was a topper in Inter.. wanted to become an IAS.. is now a crazy heroine in Tollywood, She Is Raashi Khanna
Tollywood: ఇంటర్లో టాపర్.. IAS కావాలనుకున్న అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే అమ్మాయి. తనకంటూ మంచి గుర్తింపు ఉన్న ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడి చదివింది. ఇంటర్ లో టాపర్. యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనుకుంది. కానీ అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?
Updated on: Sep 30, 2025 | 1:23 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తెలుగులో క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తుంది. సింపుల్ లుక్స్ లో, ఉంగరాల జుట్టుతో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. చిన్నప్పుడే పలు యాడ్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జాన్ అబ్రామ్‌తో కలిసి వెండితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు నేడు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సహజ నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా. చిన్నప్పటి నుంచి ఆమెకు అతిపెద్ద కల ఐఏఎస్ అధికారిణి కావడమే. అందుకోసం చిన్నప్పటి నుంచే చదువు మీద దృష్టి పెట్టింది. సినిమా ప్రపంచం వైపు అడుగులు వేసింది. 12వ తరగతి పబ్లిక్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.

రాశి ఖన్నా ఢిల్లీలో పాఠశాల విద్య పూర్తి చేసి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది. సివిల్ సర్వీసులోకి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాశి ఖన్నా 2013లో జాన్ అబ్రామ్‌తో కలిసి "మద్రాస్ కేఫ్" చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దాదాపు 11 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది. ఇప్పుడు తన హిందీలో కొనసాగుతుంది.




