- Telugu News Photo Gallery Cinema photos Do You Know Karthika Deepam 2 Serial Actress Premi Viswanath Remuneration Per Day
Karthika Deepam 2 : బాబోయ్.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే.. వంటలక్క ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?
ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరు కంటే ఎక్కువగా వంటలక్క, దీప అనే పేర్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. కార్తీక దీపం సీరియల్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. సహజ నటనతో జనాల హృదయాలలో చెరగని ముద్ర వేసింది.
Updated on: Nov 06, 2025 | 9:50 PM

కార్తీక దీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది వంటలక్క, దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

కార్తీక దీపం సీరియల్ ముగిసిన తర్వాత కొన్నాళ్లపాటు తెలుగు తెరకు దూరంగా ఉండిపోయిన ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా అలరిస్తుంది. ఇందులో మరోసారి కట్టుబొట్టు, సహజ నటనతో కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కార్తీక దీపం 2 సీరియల్ లో నటించినందుకు ఒక్క రోజుకు రూ.50 వేలు పారితోషికం తీసుకుంటుందట. అంటే నెలకు దాదాపు 10 లక్షల వరకు ఉంటుందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలవుతుంది.

రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక నివేదికల ప్రకారం ప్రేమి విశ్వనాథ్ ఆస్తులు దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటాయని టాక్. అలాగే ఆమె వద్ద రెండు లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనం ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్ 2013లో కరతముత్తు అనే సీరియల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు వినీత్ భట్. వీరికి మనుజీత్ అనే బాబు ఉన్నాడు.




