- Telugu News Photo Gallery Cinema photos Actress Divi Dadthya Shares Stuns With Edgy Modern Photos In Her Instagram
Actress : న్యూస్ పేపర్ షర్ట్‌లో అందాల రాక్షసి.. మత్తెక్కిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.. గుర్తుపట్టారా.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన తెలుగమ్మాయిలు చాలా అరుదు. ఇప్పుడిప్పుడే కొందరు హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటుండగా.. మరికొందరు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ సోషల్ మీడియాలో విపరతీమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ ఒకరు.
Updated on: Nov 06, 2025 | 5:57 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ? న్యూస్ పేపర్ షర్టులో గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తోన్న ఆ వయ్యారి తెలుగు సినీప్రియులకు సుపరిచితమే. నటనపై ఆసక్తితో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి పలు యాడ్స్ చేసింది.

మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ బ్యూటీ మరెవరో కాదండి బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య.

బిగ్ బాస్ షో తర్వాత గాడ్ ఫాదర్, లంబసింగి వంటి చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసినప్పటికీ దివికి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం కొత్త కొత్త గ్లామర్ ఫోటోలతో కవ్విస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. న్యూస్ పేపర్ చొక్కా ధరించి గ్లామర్ ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ పిక్స్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అటు ట్రిడిషనల్.. ఇటు గ్లామర్ ఫోటోలతో నిత్యం నెట్టింట రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం సినిమాల్లో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న దివి.. ఇటు సోషల్ మీడియాలో అందాల సెన్సేషన్ అవుతుంది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా చిన్న పాత్ర పోషించిన దివి.. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది.




