- Telugu News Photo Gallery Cinema photos Director shankar and kamal haasan panic on indian 2 release dates
శంకర్‌ను, కమల్ హాసన్‌ను కంగారు పెడుతున్న రెండు విషయాలు.. ఏంటంటే ??
డైరక్టర్ శంకర్‌కీ, యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్‌కి ఇప్పుడు ఒకటే టెన్షన్. సారీ.. ఒకటి కాదు రెండు టెన్షన్లు. ఆ రెండూ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయిన టెన్షన్లే. ఇంతకీ ఏంటవి? కంబైన్డ్ గా కంగారు పెట్టే విషయాలా? లేకుంటే ఎవరికి వారికి ఇండివిజువల్ ఇబ్బందులా? చూసేద్దాం రండి... అప్పుడెప్పుడో 2017లో అనౌన్స్ అయింది ఇండియన్2. షూటింగ్ మొదలుపెట్టింది మాత్రం 2019లో. 2020లో సెట్లో యాక్సిడెంట్ జరగడం, ఆ వెంటనే కోవిడ్ రావడం.. రీజన్స్ ఏవైతేనేం.. 2022 నుంచి యాక్టివ్‌గా జరుగుతోంది ప్రాజెక్ట్.
Updated on: May 03, 2024 | 7:20 PM

డైరక్టర్ శంకర్‌కీ, యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్‌కి ఇప్పుడు ఒకటే టెన్షన్. సారీ.. ఒకటి కాదు రెండు టెన్షన్లు. ఆ రెండూ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయిన టెన్షన్లే. ఇంతకీ ఏంటవి? కంబైన్డ్ గా కంగారు పెట్టే విషయాలా? లేకుంటే ఎవరికి వారికి ఇండివిజువల్ ఇబ్బందులా? చూసేద్దాం రండి...

అప్పుడెప్పుడో 2017లో అనౌన్స్ అయింది ఇండియన్2. షూటింగ్ మొదలుపెట్టింది మాత్రం 2019లో. 2020లో సెట్లో యాక్సిడెంట్ జరగడం, ఆ వెంటనే కోవిడ్ రావడం.. రీజన్స్ ఏవైతేనేం.. 2022 నుంచి యాక్టివ్‌గా జరుగుతోంది ప్రాజెక్ట్.

ఈ ఏడాది జూన్‌లో విడుదల చేస్తామని అన్నారు మేకర్స్. ఇండియన్2ని కచ్చితంగా హిట్ చేసి చూపించాల్సిన బరువు బాధ్యతలను మోస్తున్నారు శంకర్. ఈ సినిమా రిజల్ట్... రామ్‌చరణ్ గేమ్ చేంజర్ మీద కచ్చితంగా ఉంటుందని తెలుసు శంకర్‌కి.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు శంకర్. శంకర్‌కైనా ఇండియన్2కీ, గేమ్‌చేంజర్‌కి కాసింత గ్యాప్ ఉంది. కానీ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఒకే నెలలో రెండు సినిమాల రిలీజుల్ని చూస్తారు యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్.

ఇండియన్2 రిజల్ట్ ఎఫెక్ట్, కల్కి మీద ఎంతో కొంత తప్పకుండా ఉంటుందన్న సంగతి లోకనాయకుడికీ తెలుసు. ఆడియన్స్ తీర్పు ఎలా ఉన్నా, 2024ని మాత్రం అటు శంకర్, ఇటు కమల్... ఇద్దరిలో ఎవరూ మర్చిపోరన్నమాట.




