- Telugu News Photo Gallery Cinema photos Director Sandeep Reddy Vanga Movie Animal compare with arjun reddy Movie as in Ranbir Kapoor and rashmika mandanna Telugu Entertainment Photos
Animal: యాక్షన్ ఒక్కటే కాదు.. రొమాన్స్ కూడా లైక్ అర్జున్ రెడ్డి అంటున్న యానిమల్ డైరెక్టర్.
యానిమల్ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుందా..? అర్జున్ రెడ్డిలో అంత అద్భుతమైన ప్రేమకథ చెప్పిన సందీప్ ఈ సారి కేవలం మాస్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారా..? ఇప్పటి వరకు రిలీజ్ అయిన యానిమల్ టీజర్, పోస్టర్స్ చూసాక ప్రతీ ఒక్కరికి వచ్చిన డౌట్ ఇదే. మరి దీనికి సమాధానమేంటి..? నిజంగానే యానిమల్ యాక్షన్‌తో నిండిపోనుందా..? సందీప్ రెడ్డి వంగా చేసింది ఒక్క సినిమానే అయినా కూడా ఇండియా షేక్ అయిపోయింది.
Updated on: Oct 13, 2023 | 6:24 PM

యానిమల్ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుందా..? అర్జున్ రెడ్డిలో అంత అద్భుతమైన ప్రేమకథ చెప్పిన సందీప్ ఈ సారి కేవలం మాస్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారా..? ఇప్పటి వరకు రిలీజ్ అయిన యానిమల్ టీజర్, పోస్టర్స్ చూసాక ప్రతీ ఒక్కరికి వచ్చిన డౌట్ ఇదే.

మరి దీనికి సమాధానమేంటి..? నిజంగానే యానిమల్ యాక్షన్‌తో నిండిపోనుందా..? సందీప్ రెడ్డి వంగా చేసింది ఒక్క సినిమానే అయినా కూడా ఇండియా షేక్ అయిపోయింది. అర్జున్ రెడ్డితో తెలుగు సినిమాకు పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చారు ఈ దర్శకుడు.

దానికి తోడు హిందీలోనూ దుమ్ము దులిపేసింది అర్జున్ రెడ్డి. దాంతో సందీప్ పేరు హాట్ టాపిక్ అయిపోయింది. ప్రస్తుతం యానిమల్ సినిమాతో బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు సందీప్ వంగా. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ టీజర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంది.

దీనికి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ప్రీ టీజర్, టీజర్ అంతా యాక్షన్‌తోనే నిండిపోయింది. రష్మిక మందన్న ఉన్నా రొమాన్స్ ఉండదేమో అనుకున్నారంతా. కానీ అనుమానాలు అక్కర్లేదు.

యాక్షన్‌తో పాటు రొమాన్స్‌కు ఢోకా లేకుండా చూసుకుంటున్నారు సందీప్. సందీప్ సినిమా అంటే రొమాన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అందులోనూ లిప్ లాక్స్ కంపల్సరీ. అర్జున్ రెడ్డిలో ఎన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయో చెప్పనక్కర్లేదు.

తాజాగా యానిమల్‌లోనూ అదే చేయబోతున్నారీయన. తాజాగా విడుదలైన పోస్టర్‌లో రణ్‌బీర్, రష్మిక లిప్ లాక్ వైరల్ అవుతుంది. అక్టోబర్ 11న అమ్మాయి అనే పాట విడుదల కానుంది. అందులో రొమాన్స్ మరింత ఘాటుగా ఉండబోతుంది. డిసెంబర్ 1న రిలీజ్ కానుంది యానిమల్.




