- Telugu News Photo Gallery Cinema photos Director Harish shankar tweet on Ustaad Bhagat Singh update on political setairs Telugu Entertainment Photos
Ustaad Bhagat Singh: ఈసారి డోస్ పెరిగింది.. “మనల్ని ఎవడ్రా ఆపేది” అంటున్న హరీష్.
సెటైర్లు పేల్తాయంటున్నారు ఈ దర్శకుడు. సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయం పక్కనబెడితే బ్రో రాజకీయంగా మాత్రం చాలా పెద్ద దుమారమే రేపింది. సినిమాలో ఉన్న చిన్న పాత్ర కావాల్సినంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానిపై ఏకంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సైతం ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అవ్వడంతో బ్రోపై పొలిటికల్‌గా చర్చ బానే జరిగింది. ఇంత చిన్న దానికే ఇలా ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ అంతా పొలిటికల్‌గానే సాగబోతుంది.
Updated on: Aug 07, 2023 | 10:22 PM

2.15 గంటల బ్రో సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఉన్నది మహా అయితే 8 నిమిషాలు మాత్రమే.. ఆ మాత్రం దానికే రాజకీయంగా బ్రో రేపిన సంచలనం అందరికీ తెలిసిందే.

మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది..? అసలే అక్కడున్నది హరీష్ శంకర్.. సెటైర్లు వేయడంలో ఈయన స్టైలే వేరు. పైగా ఉస్తాద్‌లో పొలిటికల్ పంచులు ఉండబోతున్నాయని..

సెటైర్లు పేల్తాయంటున్నారు ఈ దర్శకుడు. సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయం పక్కనబెడితే బ్రో రాజకీయంగా మాత్రం చాలా పెద్ద దుమారమే రేపింది. సినిమాలో ఉన్న చిన్న పాత్ర కావాల్సినంత సెన్సేషన్ క్రియేట్ చేసింది.

దానిపై ఏకంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సైతం ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అవ్వడంతో బ్రోపై పొలిటికల్‌గా చర్చ బానే జరిగింది. ఇంత చిన్న దానికే ఇలా ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ అంతా పొలిటికల్‌గానే సాగబోతుంది.

పేరుకు తెరీ రీమేక్ అయినా కూడా.. కేవలం మూలకథను మాత్రమే తీసుకుని గబ్బర్ సింగ్ మాదిరే ఫ్రెష్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు హరీష్ శంకర్. ఈ సారి ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే ఉండదు.. ఇంకా చాలా ఉంటాయని ఇప్పటికే టీజర్‌లోనే చెప్పారు హరీష్.

సినిమాలోనూ రాజకీయ వ్యంగ్యాస్త్రాలు చాలానే ఉండబోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సెటైర్లు, పంచులపై హరీష్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇక ఏ సినిమాలు వద్దనుకున్న పవన్.. బ్రో తర్వాత మనసు మార్చుకుని ఉన్నట్లుండి ఉస్తాద్‌ను ముందుకు తీసుకొచ్చారు.

ఆగస్ట్ 10-19 మధ్య వారాహి యాత్ర జరగనుంది.. దీని తర్వాత హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ ఇచ్చారు పవన్. 2024 ఎలక్షన్స్‌కు ముందు జనసేనకు ఈ సినిమా ఆయుధంగా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇవన్నీ నిజమే అన్నట్లు హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేసారు.అంటే.. బ్రో టీజర్ అయితే.. అసలు సినిమా ఉస్తాద్‌లో ఉండబోతుందన్నమాట.




