కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పరిధి చాలా తక్కువగా ఉంటుందని అన్నారు నటి తాప్సీ. హీరోయిన్ల కేరక్టర్లను కొన్ని సన్నివేశాలకు, పాటలకు మాత్రమే పరిమితం చేస్తారని చెప్పారు. అలాంటప్పుడు ఆ సినిమాల ఫ్లాప్‌లకు హీరోయిన్లు ఎలా కారణమవుతారని ఆమె ప్రశ్నించారు. తన కెరీర్లో ఇలాంటివి చాలా విన్నానని, తర్వాత పట్టించుకోవడం మానేశానని చెప్పారు.