- Telugu News Photo Gallery Cinema photos Director Boyapati Srinu plan with Balakrishna akhanda 2 thandavam movie in pan india, Details Here
Akhanda 2: బాలయ్య క్రేజ్.. అఖండ 2.. బోయపాటికి విజిటింగ్ కార్డులా ఉపయోగపడుతయా.?
సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలంటే ఏ చదువు చదవాలి? చదువు సంగతేమోగానీ.. ఇప్పుడున్న సిట్చువేషన్‌లో ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ రాయాలి. ఆల్రెడీ రీజినల్‌గా ప్రూవ్ చేసుకున్న మాస్ కెప్టెన్స్ అయినా.. ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ పక్కాగా అటెండ్ కావాల్సిందే. లేటెస్ట్ గా ఈ ఎంట్రన్స్ రాయడానికి అఖండ 2తో ప్రిపేర్ అవుతున్నారు బోయపాటి. నందమూరి బాలకృష్ణ - బోయపాటి కలిసి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ..
Updated on: Nov 30, 2024 | 9:50 PM

ఆహాలో డిసెంబర్ 6న ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందులోనూ మోక్ష్‌తో బాలయ్య ఎంత సరదాగా ఉంటారో ఫస్ట్ టైమ్.. ఈ షోలోనే చూడబోతున్నామన్నది అందరిలోనూ కనిపిస్తున్న ఉత్సాహం.

బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుంది. అసలు అదేం స్పీడ్ అండీ బాబూ.. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను కూడా ఎడాపెడా పూర్తి చేస్తున్నారు.


ఓ వైపు సంక్రాంతికి డాకూ మహరాజ్ అంటూ బాక్సాఫీస్‌పై యుద్ధం ప్రకటించిన బాలయ్య.. ఈలోపే అఖండ 2ను సైతం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సీక్వెల్‌పై టీం ఇచ్చిన అప్‌డేట్ ఏంటి..? దీని షూటింగ్ డీటైల్స్ ఏంటి..?

తాజాగా అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. RFCలో రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఫైట్ సీన్ చిత్రీకరణ మొదలైంది.

సినిమా మీద అద్భుతమైన హోప్స్ ఉన్నాయని చెప్పేశారు బాలయ్య. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ని కూడా ప్లానింగ్‌గా చేసుకున్నారు బోయపాటి. అఖండ2తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకోవాలన్నది బోయపాటి ఐడియా.

డివైన్ టచ్ ఉన్న మన కంటెంట్‌కి నార్త్ లో ఇప్పుడు యమా క్రేజ్ ఉంది. అఖండ2లో ఆధ్యాత్మిక టచ్ బాగానే ఉంది. ఈ పాజిటివ్ వైబ్ బోయపాటికి విజిటింగ్ కార్డులా ఉపయోగపడుతుందా?

ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ లో ఆయన డిస్టింక్షన్‌లో పాస్ అవుతారా అనేది ఫిల్మ్ నగర్‌లో డిస్కస్ అవుతున్న పాయింట్.




