- Telugu News Photo Gallery Cinema photos Dil Raju Interesting Comments On OTTs, Decrease Of Fans To Theatres
Dilraju: ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా చెడగొట్టింది మేమే అంటున్న దిల్ రాజు
సగటు ప్రేక్షకుడికి ఎంత చేరువైతే, సినిమా అంత పెద్ద హిట్ అయినట్టు అనే మాటకు ఇంకా... వేల్యూ ఇవ్వాలా వద్దా... ఇప్పుడు అరచేతిలో సెల్‌ఫోన్‌లో సినిమా చూసుకోగల వెసులుబాటు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు చేరువైన సినిమాలు సక్సెస్ అయినట్టా? థియేటర్లకు జనాలు తీసుకురాగల సినిమాలు సక్సెస్ అయినట్టా? ఆల్రెడీ మొదలైన ఈ చర్చకు దిల్‌రాజు వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టు అయింది.
Updated on: Aug 23, 2024 | 8:57 PM

ప్రేక్షకులను చెడగొట్టింది మేమే.... నాలుగు వారాల్లో సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడం వల్ల థియేటర్లకు జనాలు రావడం లేదు.... ఇదీ దిల్‌రాజు ఒపీనియన్. సినిమా అత్యంత అద్భుతం... అని మౌత్‌టాక్ తెచ్చుకున్న విజువల్ వండర్ అయితేనో.... లేకుంటే అభిమాన హీరో సినిమా అయితేనో.. థియేటర్లకు కదలాలనుకుంటున్నారు ప్రేక్షకులు. డే ఒన్ ఏమాత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమానైనా ఓటీటీల్లో చూసుకోవచ్చనే ధోరణి ఎక్కువవుతోంది.

మన దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను కూడా ఎక్కువ రోజులు థియేటర్లలో సస్టయిన్ చేసే పరిస్థితి లేదు. ముందే డిజిటల్ డీల్స్ అయిపోతుండటంతో, వాటి ప్రకారమే ఓటీటీల్లోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఓటీటీల్లోకి త్వరగా రాకుండా, హిట్ సినిమాలనే సస్టయిన్ చేయడం కష్టతరంగా మారుతుంటే.. ఫ్లాప్ సినిమాల గురించి ప్రస్తావించడం వృథా అనే టాక్ వినిపిస్తోంది.

ఓటీటీల డీలింగ్స్ మన దగ్గర ఉన్నట్టే పొరుగు ఇండస్ట్రీల్లోనూ ఉన్నాయా? థియేటర్ల వ్యవస్థ బాగుపడాలంటే, కొన్ని తరాల పాటు కొనసాగాలంటే... ఓటీటీ సంస్థలతో నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోవాలి.

ఆర్థికంగా ఎంతో కొంత భరోసా కలిగిస్తున్న ఓటీటీలను నిర్మాతలు వదులుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు తమిళ, మలయాళ ఇండస్ట్రీలు ఈ విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నాయో ఓ సారి పరిశీలించాలన్నది విశ్లేషకుల సలహా.