నాన్ థియెట్రికల్ బూమ్‌లో ఉన్నపుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటిటి స్ట్రీమింగ్స్‌కు ముందున్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. పైగా ఆడియన్స్ ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళ్తున్నారు. దాంతో నాన్ థియెట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశీ ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటిటిలోనూ కనిపించట్లేదిప్పుడు.