- Telugu News Photo Gallery Cinema photos Dasara 2024 movies list like vettaiyan, viswam, devara, swag
Tollywood News: దసరాకి దుమ్ములేపనున్న తెలుగు సినిమాలు
మొన్నటి వరకు దసరా సీజన్‌ను మన తెలుగు హీరోలు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి అప్పుడొస్తుందనుకున్న దేవర కాస్తా.. రెండు వారాలు ముందే వచ్చేస్తున్నారు. దాంతో దసరా ఖాళీ అయిపోయింది. ఇది తెలుసుకుని.. ఇప్పుడిప్పుడే మళ్లీ పండక్కి మేమొస్తామంటూ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఇదిగో తాజాగా ఈ లిస్టులో మరో సినిమా చేరిపోయింది. మరి దసరాకు వస్తున్న సినిమాలెన్ని..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Sep 12, 2024 | 1:30 PM

దానికితోడు హిందీలో పాపులర్ షోలకు కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారక్ అండ్ టీం. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు వెళ్లారు.. ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుందిప్పుడు. దాంతో పాటే సందీప్ వంగాతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈసారి దసరా మామూలుగా ఉండేలా కనిపించట్లేదు. అక్టోబర్ 12న పండగ అయితే.. రెండు వారాల ముందే దేవరతో వచ్చేస్తున్నారు తారక్. ఇక దసరా హాలీడేస్ మొదలయ్యే సమయానికి నవ్వుల యుద్ధం చేయడానికి స్వాగ్ అంటూ అక్టోబర్ 4న వచ్చేస్తున్నారు శ్రీవిష్ణు. హసిత్ గోలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా శ్రీవిష్ణు రీసెంట్ ట్రాక్ రికార్డ్ స్వాగ్‌కు బలం.

అక్టోబర్ 10న వెట్టైయాన్ అంటూ వచ్చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి బాగానే ఉంది. జై భీమ్ ఫేమ్ టిజే జ్ఞానవేల్ దీనికి దర్శకుడు.

రానా, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివంగత గాయకుడు మలేసియా వాసుదేవన్ వాయిస్‌ను AIలో రీ క్రియేట్ చేసారు అనిరుధ్.

రజినీ వస్తున్నా.. మన హీరోలు తగ్గేదే లే అంటున్నారు. అక్టోబర్ 11న విశ్వంతో వస్తున్నారు గోపీచంద్. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అందరికీ అగ్నిపరీక్షే. తాజాగా దసరా రేసులో సుహాస్ జనక అయితే గనక జాయినైంది. సెప్టెంబర్ 7న రావాల్సిన ఈ చిత్రం.. వర్షాల కారణంగా వాయిదా పడి ఏకంగా అక్టోబర్ 12కి వెళ్లిపోయింది. మొత్తానికి ఈ దసరా హౌజ్ ఫుల్ అయిపోయింది.





























