క్యూలో ఉన్న మేజర్ తెలుగు సినిమాలు.. టాలీవుడ్ లో ఒక్క హిట్ కావాలంటున్న ముద్దుగుమ్మలు
తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నది ముఖ్యంగా మూడు సినిమాలను. అందులో ఒకటి దేవర, రెండు పుష్ప, మూడు గేమ్ చేంజర్. ప్రస్తుతానికి క్యూలో ఉన్న మేజర్ సినిమాలు ఈ మూడే. ఈ మూడు సినిమాల్లో నటిస్తున్న నాయికలకూ అర్జంటుగా ఓ హిట్ కావాలి.. మరీ అంత అర్జంటా? అని అంటారేమో... అర్జంటే మరి! జాన్వీ కపూర్ నార్త్ లో ఇన్నేళ్లూ చేసిన మూవీస్ అన్నీ ఓ లెక్క.