AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటి బీఎన్ రెడ్డి నుంచి నేటి మోహన్ లాల్ వరకూ దక్షిణాది నుంచి ఫాల్కే అవార్డ్ ను ఎంత మంది అందుకున్నారంటే

భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమలో సేవలందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇది సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారం. ఈ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ఈ అవార్డును 55 మంది అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను ఈ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ కు ఇస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ ఈ అవార్డును ఎంతమంది దక్షిణ భారత ప్రముఖులు అందుకున్నారో తెలుసా..

Surya Kala
|

Updated on: Sep 21, 2025 | 12:55 PM

Share
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన సినీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తుగా దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమలో అభివృద్ధికి చేసే గుర్తుగా అవార్డుని అందిస్తుంది. 1969లో తొలిసారిగా  ఈ అవార్డు ప్రధానం ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకూ ఈ అవార్డుని మొత్తం  55 మంది అందుకున్నారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం పతకం, ఒక శాలువా, 10,00,000నగదుని బహుమతిగా అందిస్తారు. ఈ అవార్డుని అందుకున్న దక్షిణ భారత సినీ ప్రముఖులు ఎవరంటే

1 / 13
తెలుగు సినిమా మార్గదర్శకులలో ఒకరైన బిన్ రెడ్డికి 1974లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఫాల్కే అవార్డు అందుకున్న తొలి దక్షిణ భారత చిత్రనిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవ అపారమైనది. పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

2 / 13
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎల్.వి. ప్రసాద్ పని చేయని భాష లేదు. భారతదేశపు మొట్టమొదటి టాకీ చిత్రంలో నటించన ప్రసాద్. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో పనిచేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన చేసిన సేవ అపారమైనది. ఆయనకు 1982లో ఫాల్కే అవార్డు లభించింది.

3 / 13
నిర్మాతగా తెలుగు సినిమాకు అద్భుతమైన చిత్రాలను అందించిన బి. నాగిరెడ్డికి 1986లో ఫాల్కే అవార్డు లభించింది. ఆయన ఆసియాలోనే అతిపెద్ద విజయ వాహిని స్టూడియోను నిర్మించారు.

4 / 13
తెలుగు సినిమా సూపర్ స్టార్ నటుడు, అక్కినేని నాగేశ్వరరావుకు 1990లో ఫాల్కే అవార్డు లభించింది. నట సామ్రాట్ గా ఖ్యాతి గాంచిన నాగేశ్వరరావును తెలుగు సినిమా తొలి సూపర్ స్టార్ అని  పిలుస్తారు.

5 / 13
కన్నడ సినిమా రంగంలో  స్టార్ హీరో డాక్టర్ రాజ్‌కుమార్‌కు 1995లో ఫాల్కే అవార్డు లభించింది. రాజ్‌కుమార్ చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వబడింది.

6 / 13
 
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు , రాజకీయ నాయకుడైన శివాజీ గణేషన్ కు 1996లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు.

7 / 13
 
మలయాళ సినిమా రంగంలో ప్రఖ్యాత దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ కు 2004 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. అదూర్ అనేక అద్భుతమైన కళాత్మక, భావనాత్మక చిత్రాలను అందించారు.

8 / 13
తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన రామానాయుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. రామానాయుడు స్టూడియో అధినేత. సినీ పరిశ్రమ అభివృద్దికి ఆయన చేసిన కృషికి గాను రామానాయుడుకి 2009లో ఫాల్కే అవార్డు లభించింది.

9 / 13
 
తమిళం , తెలుగు సహా అనేక భాషలలో అనేక అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె. బాలచందర్ కు 2010 లో ఫాల్కే అవార్డు లభించింది.

10 / 13
'శంకరాభరణం', 'సాగర్ సంగమం', 'స్వాతిముత్యం', 'స్వయం కృషి', 'సిరివెన్నెల', 'శుభలేఖ',  వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌ 2016లో ఫాల్కే అవార్డును అందుకున్నారు.

11 / 13
2019 లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు లభించింది. భారతీయ సినిమా పరిశ్రమకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించారు.

12 / 13
మలయాళ సినీ సూపర్ స్టార్ మోహన్ లాల్ 2023 ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.  సెప్టెంబర్ 23, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోహన్ లాల్ కు ఈ అవార్డుని ప్రధానం చేస్తారు.

13 / 13