- Telugu News Photo Gallery Cinema photos Controversial movies like the kerala story The Kashmir Files godhra the sabarmati report now trending
వరుసపెట్టి వస్తున్న కాంట్రవర్షియల్ సినిమాలు.. తాజాగా ఆ లిస్ట్ చేరనున్న మరొక మూవీ
పొగ బెడితే కలుగులోంచి ఎలకలు బయటికి ఎలా వస్తాయో.. సినిమా అనే పొగ బెట్టి చరిత్రలో మగ్గిపోతున్న కొన్ని విషయాలను బయటికి తీసుకొస్తున్నారు మేకర్స్. ఒకర్ని చూసి మరొకరు.. ఓ సినిమాను చూసి మరోటి.. చైన్ మాదిరి కాంట్రవర్షియల్ సినిమాలు ఒక్కొక్కటిగా పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా గోద్రా అల్లర్ల నేపథ్యంలో సినిమా వస్తుంది. మరి అదెలాంటి సంచలనం సృష్టించబోతుంది..?
Updated on: Nov 01, 2024 | 8:52 PM

పొగ బెడితే కలుగులోంచి ఎలకలు బయటికి ఎలా వస్తాయో.. సినిమా అనే పొగ బెట్టి చరిత్రలో మగ్గిపోతున్న కొన్ని విషయాలను బయటికి తీసుకొస్తున్నారు మేకర్స్. ఒకర్ని చూసి మరొకరు.. ఓ సినిమాను చూసి మరోటి.. చైన్ మాదిరి కాంట్రవర్షియల్ సినిమాలు ఒక్కొక్కటిగా పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా గోద్రా అల్లర్ల నేపథ్యంలో సినిమా వస్తుంది. మరి అదెలాంటి సంచలనం సృష్టించబోతుంది..?

బాగా తెగించావురా నువ్వు.. చూస్తా నీ సంగతి చూస్తా అంటూ బ్రహ్మానందం అదుర్స్‌లో చెప్పిన డైలాగ్ గుర్తుందిగా..! దీన్నే కాస్త మారుద్దామా ఇప్పుడు..! అక్కడ తెగించింది నిర్మాతలైతే.. వాళ్ల సంగతి చూస్తామంటున్నది వివాదాలు. కాసులు కురిపిస్తున్న కాంట్రవర్సీ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు మేకర్స్. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ కాదు.. వాటికి అమ్మమ్మ లాంటి కాంట్రవర్షియల్ సినిమాలు రెడీ అవుతున్నాయిప్పుడు.

కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది. కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది. దాంతో ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చేస్తుంది. షూటింగ్ దశలో ఉండగానే.. దీన్ని నిషేధించాలని బెంగాల్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. దర్శకుడిపై కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇదే అనుకుంటే తాజాగా గోద్రా అల్లర్ల నేపథ్యంలో సినిమా వచ్చేస్తుంది.

2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోధ్రా రైల్వే స్టేషన్ దగ్గర సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు తగలబడగా.. ఆ ఘటనలో 59 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన నేపథ్యంలోనే సబర్మతి రిపోర్ట్ సినిమా తెరకెక్కిస్తున్నారు రజన్ చందేల్. ఇందులో కావాలనే చాలా నిజాలు దాచేసారనేది ఈ చిత్ర కథాంశం. టీజర్‌తోనే కాంట్రవర్సీకి తెర తీస్తుంది సబర్మతి రిపోర్ట్.

గోధ్రా ఘటనపైనే అదే పేరుతో మరో సినిమా కూడా వస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, వివాదాస్పద వీర్ సావర్కర్ జీవితంపై రణ్‌దీప్ హూడా ఓ సినిమా చేసారు. ఇక నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌజ్‌లోనూ వీర్ సావర్కర్ లైఫ్ హిస్టరీ ఉంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా.. వివాదమవ్వడం మాత్రం ఖాయం.




