రీమేక్ దర్శకులకు తగ్గిన విలువ.. కారణం అదేనా ??

రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా..? ఒక భాషలో హిట్టైన సినిమాలు మరో భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా..? రీమేక్ సినిమాలు చేసి హిట్టు కొట్టిన దర్శకులు కూడా ఎందుకు ఖాళీగా ఉన్నారు.. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్టులకు అవకాశాలు పెద్దగా రావట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 01, 2024 | 8:46 PM

రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా..? ఒక భాషలో హిట్టైన సినిమాలు మరో భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా..? రీమేక్ సినిమాలు చేసి హిట్టు కొట్టిన దర్శకులు కూడా ఎందుకు ఖాళీగా ఉన్నారు.. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్టులకు అవకాశాలు పెద్దగా రావట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి..?

రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా..? ఒక భాషలో హిట్టైన సినిమాలు మరో భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా..? రీమేక్ సినిమాలు చేసి హిట్టు కొట్టిన దర్శకులు కూడా ఎందుకు ఖాళీగా ఉన్నారు.. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్టులకు అవకాశాలు పెద్దగా రావట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి..?

1 / 5
తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ దర్శకులకు కాలం పెద్దగా కలిసి రావట్లేదు. కావాలంటే వీవీ వినాయక్‌నే తీసుకోండి.. స్ట్రైట్ సినిమాలు చేసినన్ని రోజులు ఈయన కెరీర్‌కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రీమేక్ సినిమాల వైపు వెళ్లారో.. అప్పటి నుంచి వినాయక్ వైపు హీరోలు పెద్దగా చూడట్లేదు. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన చత్రపతి హిందీ రీమేక్ అయితే రెండ్రోజులు కూడా ఆడలేదు.

2 / 5
పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలి కొన్నేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. అలాగే రెండేళ్ల కింద వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ సైతం చాలా రోజుల ఎదురు చూపుల తర్వాత గానీ నితిన్‌తో తమ్ముడు సినిమా అవకాశం అందుకోలేదు.

3 / 5
దీనికంటే ముందు రవితేజ, అల్లు అర్జున్ లాంటి హీరోలతో వేణు శ్రీరామ్ సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. గాడ్ ఫాదర్ సినిమాతో మెప్పించిన మోహన్ రాజాకు కూడా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా ఊహించిన కలెక్షన్స్ రాలేదు.

4 / 5
మరోవైపు అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద హీరోల నుంచి పిలుపు కరువైంది. ఈ మధ్యే విరాట్ అనే కొత్త హీరోతో పెదకాపు చేసినా ఫలితం దక్కలేదు. వీళ్లు మాత్రమే కాదు మరికొందరు రీమేక్ దర్శకులు అవకాశాల వేటలో వెనుకబడ్డారు.

5 / 5
Follow us