- Telugu News Photo Gallery Cinema photos Bollywood senior actress madhubala biopic officially announced details here Telugu Actress Photos
Madhubala: బాలీవుడ్ మధుబాల బయోపిక్ లో నటిస్తుంది గా ఆ స్టార్ హీరోయిన్ నేనా.?
కీర్తి సురేష్ లీడ్ రోల్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహానటి. సౌత్ సినిమాకు సావిత్రి ఎలాగో బాలీవుడ్‌కు మధుబాలా కూడా అంతే. తెర మీద ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన మధుబాల, వ్యక్తి గత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్న కథ కావాటం మధుబాల జీవితాన్ని సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు బాలీవుడ్ మేకర్స్.
Updated on: Mar 23, 2024 | 3:14 PM

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బయోగ్రాఫికల్ మూవీ మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ జనరేషన్‌కు మహానటిని పరిచయం చేసింది. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ కూడా ఇలాంటి ఓ కథకు దృశ్యరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

కీర్తి సురేష్ లీడ్ రోల్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహానటి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మహానటి జీవితంలోని ఎత్తు పల్లాలను అద్భుతంగా చూపించిన దర్శకుడు, సావిత్ర కథను ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయటంలో సక్సెస్ అయ్యారు.

సౌత్ సినిమాకు సావిత్రి ఎలాగో బాలీవుడ్‌కు మధుబాలా కూడా అంతే. తెర మీద ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన మధుబాల, వ్యక్తి గత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.

ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్న కథ కావాటం మధుబాల జీవితాన్ని సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు బాలీవుడ్ మేకర్స్.

అలియా లీడ్ రోల్‌లో డార్లింగ్స్ మూవీ రూపొందించిన జస్మిత్ కే రీన్, మధుబాల బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అలియా భట్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి మధుబాల బయోపిక్ మహానటి సక్సెస్‌ను గుర్తు చేస్తుందేమో చూడాలి.




