- Telugu News Photo Gallery Cinema photos Super Movie Heroine Ayesha Takia Said Not Interested In Movie Telugu Actress Photos
Ayesha Takia: గ్లామర్ వరల్డ్‌తో సంబంధం లేదన్న ఆయేషా.! షాక్ ఇచ్చిన హీరోయిన్.
చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ వరల్డ్‌లో గట్టిగా గుర్తుండిపోయిన పేరు అయేషా టకియా. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసిన ఈ బ్యూటీ సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు. దాదాపు పన్నెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సడన్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. బాలీవుడ్ ఫాంటసీ మూవీ టార్జాన్ ది వండర్ కార్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అయేషా టకియా.
Updated on: Mar 23, 2024 | 3:14 PM

చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ వరల్డ్‌లో గట్టిగా గుర్తుండిపోయిన పేరు అయేషా టకియా. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసిన ఈ బ్యూటీ సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు.

దాదాపు పన్నెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సడన్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. బాలీవుడ్ ఫాంటసీ మూవీ టార్జాన్ ది వండర్ కార్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అయేషా టకియా.

తొలి సినిమాలోనే గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ భామ తరువాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా పలకరించారు అయేషా.

ఒక్క సినిమా మాత్రమే చేసినా... తెలుగు ఆడియన్స్ కూడా ఇప్పటికీ ఈ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా కాలం తరువాత కెమెరా కంట పడిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

ఇటీవల గోవా వెళ్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అయేషాని కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ఈ ఫోటోస్‌తో పాటు ఆమె లుక్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వైరల్ కావటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ.

ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండి వెళ్తున్న నా లుక్ గురించి కామెంట్ చేయటం ఏంటి? అంటూ కౌంటర్ ఇచ్చారు. నా గురించి మాట్లాడటం తప్ప వాళ్లకి ఇంకే పనిలేదా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమాలు చేయటం మానేసి పదేళ్లు దాటిపోయింది.

అయినా గ్లామరస్‌గానే కనిపించాలా? అని ప్రశ్నించారు అయేషా. గ్లామర్ ఫీల్డ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా లేదని చెప్పారు. తన మీద ఫోకస్ చేయటం మానేయమంటూ రిక్వెస్ట్ చేశారు.




