- Telugu News Photo Gallery Cinema photos Bollywood Salman Khan has high hopes for Tiger 3 Details Telugu Entertainment Photos
Tiger 3: టైగర్ 3పై భారీ ఆశలు పెట్టుకున్న సల్మాన్ ఖాన్.! థియేటర్ రెస్పాన్స్ ఏంటంటే.?
షారుక్ ఖాన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్ సల్మాన్‌కు మాత్రం హ్యాండ్ ఇస్తుందా..? కింగ్ ఖాన్ కొట్టి చూపించిన రికార్డుల్ని కండల వీరుడు క్రాస్ చేస్తారా లేదా..? ఒకప్పుడు వరస 100 కోట్లతో బాక్సాఫీస్‌కు చెమటలు పట్టించిన భాయ్ కమ్ బ్యాక్ టైగర్ 3తో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..? టైగర్ 3 ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..? బుకింగ్స్ ఏం చెప్తున్నాయి.? బాలీవుడ్ సినిమాలకు హిందీలోనే కాదు తెలుగులోనూ గుడ్ టైమ్ నడుస్తుందిప్పుడు. షారుక్ పుణ్యమా అని పఠాన్, జవాన్ కుమ్మేసాయి..
Satish Reddy Jadda | Edited By: Anil kumar poka
Updated on: Nov 13, 2023 | 10:10 AM

షారుక్ ఖాన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్ సల్మాన్‌కు మాత్రం హ్యాండ్ ఇస్తుందా..? కింగ్ ఖాన్ కొట్టి చూపించిన రికార్డుల్ని కండల వీరుడు క్రాస్ చేస్తారా లేదా..?

ఒకప్పుడు వరస 100 కోట్లతో బాక్సాఫీస్‌కు చెమటలు పట్టించిన భాయ్ కమ్ బ్యాక్ టైగర్ 3తో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..? టైగర్ 3 ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..? బుకింగ్స్ ఏం చెప్తున్నాయి..?

బాలీవుడ్ సినిమాలకు హిందీలోనే కాదు తెలుగులోనూ గుడ్ టైమ్ నడుస్తుందిప్పుడు. షారుక్ పుణ్యమా అని పఠాన్, జవాన్ కుమ్మేసాయి.. అంచనాల్లేకుండా వచ్చిన గదర్ 2 హిందీ వర్షన్ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు సాధించింది.

దాంతో డబుల్ స్పీడ్‌తో వచ్చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఈయన టైగర్ 3తో దివాళి కానుకగా నవంబర్ 12న వచ్చేస్తుంది. సల్మాన్ ఖాన్‌కు సరైన హిట్ లేక నాలుగేళ్లైంది. ఈ ఏడాది వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టరే.

అసలేంటి కండలవీరుడికి వచ్చిన కష్టం..? అసలు ఆయన లేటెస్ట్ సినిమా టైగర్ 3 పరిస్థితేంటి..? మిగిలిన స్పై సినిమాలను బీట్ చేస్తుందా లేదా..? బాలీవుడ్‌లో స్పై సినిమాల టైమ్ నడుస్తుంది.

ఆ యూనివర్స్‌లోనే వచ్చే సినిమా కాబట్టి.. అలాగే ఉండటంలో ఆశ్చర్యం లేదు. బుకింగ్స్ విషయంలో పఠాన్, జవాన్ కంటే చాలా వెనకబడింది టైగర్ 3. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 లక్షలు, తమిళంలో 50 వేల రూపాయల విలువైన టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి.

సల్మాన్ ఖాన్ తెలిసి తెలిసి రిస్క్ చేసారా..? టైగర్ 3కి అది నష్టం చేస్తుందని తెలిసినా కూడా వెనక్కి తగ్గలేదా.. మొండి ధైర్యంతో ముందుకు వెళ్లి ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారా..? చేతుల్లో ఉన్న సినిమాను.. చేతులారా వదిలేసుకున్నారా..?





























