- Telugu News Photo Gallery Cinema photos Tamil Star Hero Vijay thalapathy Shocking Comments on Political entry Telugu Heroes Photos
Vijay thalapathy: రాజకీయ అరంగేట్రంపై విజయ్ దళపతి స్పందన.! వస్తున్నట్టేనా.?
తమిళనాట టాప్ స్టార్స్‌కు సంబంధించిన పొలిటికల్ న్యూస్ ఎప్పుడూ ట్రెండింగ్ టాపికే. కమల్ సినిమాలతో పాటు పాలిటిక్స్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. రజనీకాంత్ రాజకీయం మనకు సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అందరి దృష్టి విజయ్ మీదే ఉంది. తాజాగా లియో సక్సెస్‌మీట్ తరువాత దళపతి పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. లియో రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.
Updated on: Nov 13, 2023 | 11:11 AM

తమిళనాట టాప్ స్టార్స్‌కు సంబంధించిన పొలిటికల్ న్యూస్ ఎప్పుడూ ట్రెండింగ్ టాపికే. కమల్ సినిమాలతో పాటు పాలిటిక్స్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. రజనీకాంత్ రాజకీయం మనకు సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పుడు అందరి దృష్టి విజయ్ మీదే ఉంది. తాజాగా లియో సక్సెస్‌మీట్ తరువాత దళపతి పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. లియో రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.

కానీ అప్పట్లో పర్మిషన్ రాకపోవటంతో ఆ ఈవెంట్ జరగలేదు. అయితే ఈవెంట్‌కు పర్మిషన్స్ రాకపోవటం వెనుక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయన్నటాక్ చాలా బలంగా వినిపించింది.

అదే సమయంలో దళపతి రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కూడా మరోసారి తెర మీదకు వచ్చింది. రీసెంట్‌గా లియో సక్సెస్ మీట్ కోలీవుడ్‌లో పొలిటికల్ హీట్‌కు కారణమైంది.

ఈ ఈవెంట్‌లో చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చారు విజయ్. కొద్ది రోజులుగా విజయ్‌ని సూపర్ స్టార్ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే లియో వేడుకలో తాను దళపతిని మాత్రమే, కోలీవుడ్‌లో ఒక్కరే సూపర్ స్టార్ ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు.

లియో సక్సెస్‌మీట్‌లో విజయ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. 'నేను దళపతిని, ప్రజల దళపతిని, వాళ్లు ఏది చెబితే అది చేస్తాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను' అంటూ విజయ్ చెప్పటంతో ఇది పొలిటికల్ ఎంట్రీ గురించే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

చాలా ఏళ్లుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల మీద ఇంతవరకు విజయ్ అధికారికంగా స్పందించలేదు, అలా అని ఖండించలేదు కూడా. దీంతో ఇప్పుడు కాకపోయినా... భవిష్యత్తులో అయినా దళపతి రాజకీయాల్లోకి రావటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.




