- Telugu News Photo Gallery Cinema photos Bollywood king khan Shah Rukh Khan taking to much gap for his next movies, details here Telugu Heroes Photos
Shah Rukh Khan: కింగ్ ఖాన్ కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారా.? ఎందుకంటే..!
ఐదేళ్ళ గ్యాప్ తర్వాత ఒకేసారి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు షారుక్ ఖాన్. మూడేళ్లకో సినిమా కూడా చేయని కింగ్ ఖాన్.. ఒకే ఏడాది మూడు సినిమాలతో వచ్చి రచ్చ చేసారు. కానీ తర్వాత మళ్లీ అదే సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇంతకీ ఈయన తర్వాతి సినిమా ఏంటి..? ఎవరితో ఉండబోతుంది..? షారుక్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అభిమానుల బాకీ అంతా ఒకేసారి తీర్చేసారు షారుక్ ఖాన్. 2023 ఈయన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Updated on: Jul 06, 2024 | 6:33 PM

ఐదేళ్ళ గ్యాప్ తర్వాత ఒకేసారి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు షారుక్ ఖాన్. మూడేళ్లకో సినిమా కూడా చేయని కింగ్ ఖాన్.. ఒకే ఏడాది మూడు సినిమాలతో వచ్చి రచ్చ చేసారు. కానీ తర్వాత మళ్లీ అదే సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇంతకీ ఈయన తర్వాతి సినిమా ఏంటి..? ఎవరితో ఉండబోతుంది..?

షారుక్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అభిమానుల బాకీ అంతా ఒకేసారి తీర్చేసారు షారుక్ ఖాన్. 2023 ఈయన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకటి రెండు కాదు.. మూడు సినిమాలతో వచ్చి.. మూడు సార్లు ప్రేక్షకులను అలరించారు కింగ్ ఖాన్.

రిపబ్లిక్ డేకు పఠాన్‌గా.. శ్రీ కృష్ణ జన్మాష్టమికి జవాన్‌గా.. క్రిస్మస్‌కు డంకీ సినిమాలో వచ్చి మాయ చేసారు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్ 1000 కోట్లకు పైగా వసూలు చేసి షారుక్ సత్తా ఏంటో చూపించాయి. ఆయన పని అయిపోయిందనుకున్న వాళ్ల నోళ్లకు తాళం వేసేలా చేసాయి ఈ రెండు సినిమాలు.

రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించిన డంకీకి కూడా 400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అంతా బాగానే ఉంది కానీ నెక్ట్స్ సినిమాపై సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు బాద్షా. షారుక్ ఖాన్ నెక్ట్స్ సినిమా లిస్టులో చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు.

ముఖ్యంగా అట్లీకే మరో ఛాన్స్ ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు రాజ్‌కుమార్ హిరాణి సైతం షారుక్ మరో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. వీళ్లు కాకుండా సీనియర్ దర్శకుడు సుజాయ్ ఘోష్ పేరు బలంగా వినిపిస్తుంది.

దర్శకులు ఎంతమంది ఉన్నా.. గ్యాప్ మాత్రం మరోసారి పక్కా అంటున్నారు షారుక్ ఖాన్. ఈయన తీరు చూస్తుంటే 2025 చివరికి గానీ నెక్ట్స్ సినిమాను తీసుకొచ్చేలా కనిపించడం లేదు.

వరస సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేదని.. మంచి స్క్రిప్ట్ దొరికినపుడు తీరిగ్గా చేస్తానంటున్నారు కింగ్ ఖాన్. మరి ఆ మంచి కథ ఎప్పటికి దొరుకుతుందో చూడాలి.




