- Telugu News Photo Gallery Cinema photos Bollywood Hot Beauty Urvashi Rautela trending in Tollywood Telugu actress Photos
Urvashi Rautela: బాలీవుడ్ టూ టాలీవుడ్ ట్రేండింగ్ లో ఉన్న ఊర్వశీ రౌతెల్లా.. నెక్స్ట్ మూవీస్.?
బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన ఓ గ్లామర్ క్వీన్ ఇప్పుడు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నా.. స్టార్ హీరోయిన్స్‌కు కూడా తీసిపోని రేంజ్‌లో పేమెంట్ అందుకుంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..?
Updated on: Jul 12, 2023 | 8:15 PM

బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన ఓ గ్లామర్ క్వీన్ ఇప్పుడు సౌత్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నా... స్టార్ హీరోయిన్స్‌కు కూడా తీసిపోని రేంజ్‌లో పేమెంట్ అందుకుంటున్నారు.

ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాస్ పార్టీ చేసిన ఊర్వశీ రౌతెల్లా ప్రజెంట్ బ్రోతో కలిసి మరోసారి ట్రెండ్ అవుతున్నారు.

అంతేకాదు సౌత్‌లో స్పెషల్ సాంగ్స్ కోసం ఈ బ్యూటీ అందుకుంటున్న పేమెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

బ్లాక్ రోజ్, లెజెండ్ లాంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్‌కు చేరువయ్యారు ఊర్వశి. దీంతో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు.

ఎక్కువగా ర్యాంప్ వాక్‌లు, ఫారిన్ టూర్‌లతో న్యూస్ హెడ్‌లైన్స్‌లో కనిపించే ఊర్వశీ, ఇప్పుడు తన పేమెంట్‌కు సంబంధించిన న్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చారు.

రీసెంట్‌గా ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అంటూ మాస్ నెంబర్ ఇరగదీసిన ఊర్వశి, త్వరలో బ్రో, స్కంద సినిమాల్లోనూ కనిపించబోతున్నారు.ఈ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఊర్వశి, ఒక్కో పాటకు 3 కోట్లకు పైగా పేమెంట్ అందుకుంటున్నారట.

ప్రజెంట్ అమ్మడి క్రేజ్ చూసి ఆ రేంజ్‌లో పేమెంట్ ఇచ్చేందుకు కూడా రెడీ అంటున్నారు మేకర్స్.

ఈ మధ్య కాలంలో ఏ పాట అయినా మూడు నాలుగు నిమిషాల నిడివితోనే రూపొందుతున్నాయి. అంటే ఒక్కో నిమిషానికి కోటి రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఊర్వశీ.




