- Telugu News Photo Gallery Cinema photos Bollywood Hero Shahrukh Khan Clarity On Dunki Movie Release Date Telugu Heroes Photos
Shahrukh Khan: డంకీ రిలీజ్ డేట్ పై షారూఖ్ క్లారిటీ..!
షారుక్ ఖాన్ సినిమాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారా..? పదే పదే డంకీ రిలీజ్ డేట్ మారిందంటూ ట్రెండ్ చేస్తున్నారా..? లేదంటే నిజంగానే మారిందా..? రాజ్ కుమార్ హిరాణి సినిమా క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుందా..? కొన్ని రోజులుగా దీనిపై నాన్‌స్టాప్ చర్చ జరుగుతుంది. తాజాగా మరోసారి ఇదే రచ్చ మొదలైంది. అసలింతకీ క్రిస్మస్‌కు షారుక్ డంకీ సినిమా వస్తున్నట్లా లేదా..? 2023 పూర్తిగా షారుక్ నామ సంవత్సరం.
Updated on: Oct 20, 2023 | 8:35 AM

షారుక్ ఖాన్ సినిమాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారా..? పదే పదే డంకీ రిలీజ్ డేట్ మారిందంటూ ట్రెండ్ చేస్తున్నారా..? లేదంటే నిజంగానే మారిందా..? రాజ్ కుమార్ హిరాణి సినిమా క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుందా..? కొన్ని రోజులుగా దీనిపై నాన్‌స్టాప్ చర్చ జరుగుతుంది.

తాజాగా మరోసారి ఇదే రచ్చ మొదలైంది. అసలింతకీ క్రిస్మస్‌కు షారుక్ డంకీ సినిమా వస్తున్నట్లా లేదా..? 2023 పూర్తిగా షారుక్ నామ సంవత్సరం. దేవుడిస్తే బాగా గట్టిగా ఇస్తాడన్నట్లు.. పఠాన్, జవాన్‌లతో రెండుసార్లు 1000 కోట్లు అందుకున్నారు బాద్షా.

2023లో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు ఈ హీరో. చెప్పినట్లుగానే డిసెంబర్ 22న డంకీ విడుదలవుతుందని బాంబ్ పేల్చారు బాద్షా. వాయిదా వార్తలన్నీ అబద్ధమే.. ఎవరెన్ని చెప్పినా మేం మాత్రం చెప్పిన టైమ్‌కు వస్తామంటున్నారీయన.

షారుక్ సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తుంటే సర్వమత సమ్మేళనం కనిపిస్తుంది. జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా పఠాన్‌తో వచ్చిన ఈయన.. జన్మాష్టమికి జవాన్ అంటూ వచ్చారు. క్రిస్మస్‌కు డంకీతో వచ్చి ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు షారుక్.

రాజ్‌కుమార్ హిరాణీ దర్శకుడు కావడంతో.. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా నెక్ట్స్ లెవల్‌లోనే ఉన్నాయి. డిసెంబర్ 22న సలార్ కూడా వస్తుండటంతో.. కచ్చితంగా డంకీ వాయిదా పడుతుందనే ప్రచారమే జరుగుతుంది.

కానీ టీమ్ మాత్రం.. మేం చెప్పిన డేట్‌కు వస్తున్నాం అంటున్నారు. ఇటు ప్రభాస్, అటు షారుక్ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ నలిగిపోతున్నారు. ఎవరికీ చెప్పలేక.. బాక్సాఫీస్ వార్ తలుచుకుని భయపడుతున్నారు. మరి చూడాలిక.. డైనోసర్‌తో డంకీ పోరు ఎలా ఉండబోతుందో..?




