Ranbir Kapoor: యానిమల్ తో సహా సీక్వెల్ లైన్ లో పెడుతున్న రణబీర్ కపూర్.
యంగ్ జనరేషన్‌లో బాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ప్రూవ్ చేసుకున్న స్టార్ రణబీర్ కపూర్. వరుస బ్లాక్ బస్టర్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న చాక్లెట్ భాయ్.. ఇప్పట్లో కొత్త క్యారెక్టర్ ట్రై చేసే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ రణబీర్ కిట్టీలో ఉన్న సీక్వెల్స్ ఏంటి? యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రణబీర్ కపూర్, వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.