పాయింట్ ఏదైనా.. సిస్టమ్‌లోని లోటుపాట్లను ఎత్తి చూపించిన ప్రతీసారి మంచి సినిమాలే వస్తున్నాయి. అందుకే భారతీయుడు, ఒకే ఒక్కడు, ఠాగూర్, లీడర్ లాంటి సినిమాలు గుర్తుండిపోయాయి. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని తప్పుల్ని చూపించినపుడు ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుంది. శంకర్ జెంటిల్‌మెన్ నుంచి నిన్నటి ధనుష్ సార్ వరకు ఈ కాన్సెప్ట్ వర్కవుట్ అవుతూనే ఉంది.