ఇండస్ట్రీలో లావిష్ సాంగ్స్ ట్రెండ్.. ఒక్కో పాటకు కోట్లలో ఖర్చు
ఇండస్ట్రీలో ఇప్పుడు లావిష్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. మామూలుగా పాట నడుస్తుంటే చుట్టూ కొందరు డ్యాన్సర్లు కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఆ డ్యాన్సర్ల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంటోంది. రీసెంట్ టైమ్స్ లో ఈ కల్చర్ చాలా బాగా కనిపిస్తోంది. నాటు నాటు పాటకు తారక్ అండ్ చెర్రీతో నాటు స్టెప్పులు వేయించారు కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్. ఇప్పుడు ఈయనతోనే పనిచేస్తున్నారు తారక్. దేవర సినిమాలో దాదాపు రెండు వేల మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లతో పాటను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని స్కేల్‌లో ఉండబోతోందట దేవర పాట.