- Telugu News Photo Gallery Cinema photos Bhagyashri Borse craze in tollywood film industry know the reasons why
Bhagyashri Borse: అటు నువ్వే.. ఇటు నువ్వే.. టాలీవుడ్‌లో ఎటు చూసిన ఈ ముద్దుగుమ్మే
అటు నువ్వే.. ఇటు నువ్వే అన్నట్లుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌ను చూస్తుంటే..! ఆ మధ్య కృతి శెట్టి.. ఆ తర్వాత పూజా హెగ్డే.. రీసెంట్‌గా శ్రీలీల.. వీళ్ళదో టైమ్ నడిచింది. అప్పుడే సినిమాలో చూసినా వీళ్ళే ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌లో మరో హీరోయిన్‌కు అలాంటి టైమే నడుస్తుంది. చూస్తుంటే ఆమె మరో శ్రీలీల అయ్యేలా కనిపిస్తుంది. మరి ఎవరా బ్యూటీ..?
Updated on: Jul 06, 2025 | 4:19 PM

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైమ్ నడుస్తుంటుంది.. ఆ సమయంలో దర్శకులు, హీరోల కళ్లకు ఆ బ్యూటీ తప్ప మరొకరు కనిపించరు. హిట్లు ఫ్లాపులతో పనిలేకుండా ప్రతీ సినిమాలో వాళ్లకే ఛాన్సిస్తుంటారు.

ఉప్పెన తర్వాత కృతి శెట్టికి.. డిజే తర్వాత పూజా హెగ్డేకు.. ధమాకా తర్వాత శ్రీలీలకు ఆఫర్స్ ఇచ్చినట్లు..! వీళ్ళంతా ఒక టైమ్‌లో చాలా బిజీగా ఉన్న స్టార్స్.2022 వరకు పూజా హెగ్డే టైమ్ నడిచింది.. అదే ఏడాది చివరి నుంచి శ్రీలీల టైమ్ మొదలైంది.

మధ్యలో కొన్నాళ్లు కృతిశెట్టి హవా కనిపించింది. ఇప్పుడిదే జోరు భాగ్యశ్రీ బోర్సే విషయంలో కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఫ్లాపైనా.. అమ్మడు వరస సినిమాలతో వచ్చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో పాటు రామ్ ఆంధ్రా కింగ్ తాలూకలో నటిస్తున్నారు భాగ్యశ్రీ.

మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా.. అందులో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ బ్లాక్‌బస్టర్ అయింది. కింగ్డమ్‌లో ముందు శ్రీలీల హీరోయిన్.. ఆమె తప్పుకుంటే ఆ ఛాన్స్ భాగ్యకు వచ్చింది.. అలాగే అఖిల్ లెనిన్ విషయంలోనూ సీన్ రిపీట్ అయింది.

దాంతో పాటు దుల్కర్ సల్మాన్ కాంతాలో నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. రాబోయే ఆర్నెళ్లలో ఈ భామ నుంచి 3 సినిమాలు రానున్నాయి. మొత్తానికి తెలుగులో భాగ్య టైమ్ నడుస్తుందిప్పుడు.




